ఏదో సరదాకి..
“బాబూ..ఏ ఊరు వెళ్తున్నావు?” నన్నే ఎవరో అడిగారు.’అసలే కోతి. పైగా కల్లు తాగింది’ అన్నట్లు నేను అసలే తిక్క గాడ్ని. పైగా సాఫ్ట్వేర్ వెధవని. పైగా మళ్లీ మాంద్యం అంటున్నారు. పైగా పెళ్లి కూడా కాలేదు.విజయవాడ నాన్స్టాప్ లో నా పక్కన కూర్చున్న ముసలావిడ నన్ను ఆ ప్రశ్న అడిగితె నాకు తిక్క రేగింది. నాకు ఇప్పుడు క్విజ్ లో పాల్గొనే మూడ్ లేదని ఆవిడతో గట్టిగా పీక నొక్కి వక్కాణించి చెప్పాలనిపించింది. కాని నేను మర్యాద రామన్నని కాబట్టి “విజయవాడ” అని చెప్పాను.
“ఎక్కడ ఏమిటి విజయవాడలో?”
“పటమట”
“ఉద్యోగం చేస్తున్నావా? చదువా?”
“హైదరాబాదులో X అనే ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాను. దాని హెడ్క్వాటర్స్ అమెరికాలో ఉంది. శనాదివారాలు సెలవులు కాబట్టి ఇవ్వాళ కూడా సెలవు పెట్టి విజయవాడలో ఉన్న మా తల్లితండ్రుల దగ్గరికి వాళ్ళని చూద్దామని వెళ్తున్నాను. సోమవారం మళ్ళి తిరిగి వచ్చేస్తాను.” ఇంకేం అడుగుతుందో అని మొత్తం ఒకేసారి చెప్పేసాను.
నాకు మొదటినుండి ప్రయాణంలో పక్కన వాళ్లతో మాట్లాడే అలవాటు లేదు. “ప్రయాణీకులకు విజ్ఞప్తి. అపరిచులతో జాగ్రత్త..పరిచయస్తులు నిలువుదోపిడీ చేస్తే మీ ఖర్మ.. రైల్లో కిరోసిన్,ఫినాయిల్,హిట్ లాంటివి తీస్కెళ్ళద్దు. టపాసులు, అగరొత్తులు వెలిగించద్దు” అనే రైల్వే నినాదం చాలా శ్రద్దగా పాటిస్తాను. అందుకే ఎవరితో మాట్లాడకుండా హైదరాబాద్ సిటి బస్సులలో అమ్మాయిల్లాగా చెవిలో ఐపాడ్, అందులోంచి బయటకి వినిపిస్తూ “ఓహ్ కళంకిత..కళలకే అంకిత.., మెట్టెల సవ్వడి…ఒహ్..మెట్టెల సవ్వడి..” లాంటి హిట్ సాంగ్స్ వింటూ ఉంటాను. అసలు ఇవ్వాళ నా కోపానికి కారణం ఇంకోటి ఉంది. నాకు ఈ ఏడాది కూడా పెళ్లి కాకపోతే మా నాన్న “ఈ పిల్లాడికి పెళ్లవుతుందా?” అని సినిమా తీస్తాడుట. అది నా ఒళ్ళు మండటానికి కారణం.
నా దెబ్బకి పక్కన కూర్చున్న ఆవిడ కొంచం సేపు ఏం మాట్లాడలేదు. కాసేపటికి:
“మా మనవరాలు కూడా ట్రై చేస్తోంది. కాంపస్ లో అవ్వలేదు ట. విడిగా ఎమన్నా కుదురుతుంది ఏమిటి మీ కంపెనీ లో?”
“అయ్యో, తప్పకుండా బామ్మగారు. తన పేరు, గోత్రం, ౨ రీసెంట్ ఫోటోలు, జాతకం నా మెయిల్ కి పంపమనండి..మిగితావి నేను చూస్కుంటాను” అని అన్నాను.
“ఏమిటో సరిగ్గా వినపడలేదు బాబు..మరోసారి చెప్పు”
“అదే రేస్యుమే అని ఉంటుంది బామ్మగారు..నాకు పంపమనండి..నా అడ్రస్ మీకు ఇస్తాను..” అని పేపర్ మీద రాసిచ్చాను.
“నీకేం శ్రమ కాదు కదా?ఇలా ప్రయాణంలో పరిచయం అయ్యి అడుగుతున్నాను అని ఏం అనుకోకు…మా ఇందు చాలా తెలివైన పిల్ల..కాలేజీలో కూడా దాన్ని అందరు చాకు,బాకు,బేకు,కత్తెర అనేవారు..ఏమిటో దాని దురదృష్టం..ఇంకా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు..పిల్ల బాధ చూడలేకపోతున్నాం అనుకో..”
“మీరు మరీనండి..ఇందులో శ్రమ ఏం ఉంది..అయినా ప్రయాణీకులన్నాక ఆ మాత్రం సాయం చేస్కోకపోతే ఎలా చెప్పండి..నాకెందుకో మొదటినుండీ తోటి ప్రయాణీకులతో స్నేహంగా ఉండటం అలవాటు..”
“నువ్వు చాలా మంచి వాడిలా ఉన్నావు”
“కరెక్ట్ గా కాచ్ చేసారు.”
ఈలోగా మా బస్సు వాడు అత్యంత శక్తివంతమైన శక్తి సినిమా మొదలుపెట్టాడు. జూనియర్ ఎన్టీయార్ హిందీ మాట్లాడుతుంటే ఉదిత్ నారాయణ్ తెలుగులో పాట పాడుతున్నట్టు సొంపుగా ఉంది. అయిన ఏ సినిమా ఏస్తే నాకేంటి? నా ఇందు కూడా ఇల్లూ అంత అందంగా ఉండి ఉంటుంది అని కలలు కనసాగాను.
“అవును నిన్ను అమెరికా పంపారా బాబు?”
అదేమిటో నాకు అర్ధం కాదు. సాఫ్ట్ వేర్ వాడు అన్నాక ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి అని, అక్కడ నయాగరా ఫాల్స్ దెగ్గరో, ఎవరిదో లిమో పక్కన నిలబడో చింతకాయల రవిలో వెంకటేష్ లాగ ఫోటోలు దిగాలని, అవే తెలుగు మాట్రిమనీలో పెట్టాలి అని ఎవరు రూల్ పెట్టారో కాని, ముందు వాణ్ణి వేసేయ్యాలి. అక్కడ శనాదివారాలు కూడా పని చేసి శోష వచ్చి ,వాడిచ్చిన డీఏ సరిపోక రాత్రి పస్తులున్నా సరే..అమెరికా వెళ్తేనే గొప్ప! అక్కడ తిరిగితేనే గొప్ప! అక్కడనుండి గిఫ్ట్స్ తెస్తేనే గొప్ప! నన్నేమో ఈ మాయదారి కంపెనీ ఇంకా పంపనే లేదు. కోటి అబద్దాలు ఆడి అయినా ఒక కోడలిని తెమ్మన్నారు పెద్దలు..అందుకే..
“ఆ వెళ్ళాను బామ్మగారు..మూడు సార్లు వెళ్ళాను..చాలా దేశాలు తిరిగాను లెండి ఆ మాటకొస్తే..అందుకే మా వాళ్ళు అంటూ ఉంటారు నిన్ను ఎవరు చేస్కుంటారో కానీ..” నరకటం మొదలుపెట్టాను..
“ఇంకేం దేశాలు తిరిగావేంటి?” మధ్యలోనే నా వాక్ప్రవాహం ఆపి ప్రశ్నించింది…
“అమెరికా, రష్యా, జర్మనీ, స్వీడన్, మాల్దీవ్స్, సోమాలియా, సూడాన్” ఒకసారి వరల్డ్ మ్యాప్ మెదడులో వేస్కుని శక్తిలో ఇల్లూ లాగా ఏది బడితే అది చెప్పా.
“మంచిది బాబూ..అయితే అక్కడ చేరితే బానే తిరగచ్చు అన్నమాట. సెలవలు ఉంటాయా బాబూ?”
గాడిద చాకిరి చేయించుకుంటూ నెలాఖరికి డబ్బులు పడేస్తారు మా మోహాన పిల్లాడ్ని గిల్లి నోట్లో చాక్లేట్ పెట్టినట్టు. తెలంగాణ అని, వానలు సరిగ్గా పడట్లేదు అని, రాఖి సావంత్ పెళ్లయిపోయిందని,బందులు ఎక్కువైపోయాయని ఊర్లో బందులు జరుగుంటే మమ్మల్ని మటుకు కూర్చోపెట్టి పని చేయిస్తారు.
మళ్ళీ ‘నాతూ పెళ్ళాం తావాలి’ కాబట్టి “ఓహ్ ఉంటాయి బామ్మగారు. కావలసినన్ని ఉంటాయి” అని చెప్పాను.
“జీతం అది బానే ఉంటుందా?”
“భలే వారే మీరు…సాఫ్ట్ వేర్ అంటే మాటలా.మొన్నే ఒక ఇల్లు, కారు, ఇంట్లోకి సామాను కొన్నాను.” ఇక మీ ఇందు అందులో అడుగుపెట్టటమే ఆలస్యం అన్నట్టు చెప్పాను.
“అదృష్టవంతుడివి బాబు.మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్కోవటమే ఇంక మిగిలింది” అందామె నవ్వుతూ.
“అదే చూస్తున్నారు అండి ఇంట్లో” అని చెప్పాను సిగ్గు లేకుండా సిగ్గు నటిస్తూ..
“మా ఇందుకి కూడా చూస్తున్నాం బాబూ” అంది ఆవిడ. అలా అని నన్ను పైనుండి కిందకి చూడటం మొదలుపెట్టింది..ఛ!ఇదే ట్రైన్ అయ్యుంటే వెంకిలో రవితేజ లాగ వాష్ బసిన్ దెగ్గరికి వెళ్ళి గబ్బుకున్న పెళ్లి చూపులుంటే పనికొస్తుందని నా బ్యాగ్లో పెట్టుకున్న ఎవెర్యూత్ ఫేషియల్ చేస్కుని వచ్చేవాడని. బస్సు అవ్వటంతో పొట్ట లోపలకి పెట్టి, కళ్ళు బయటకి పెట్టి, బుర్ర పక్కకి పెట్టి ఏవేవో ట్రై చేశాను. బామ్మ మొహం చూస్తె నేను నచ్చినట్టే ఉన్నాను. తనేందుకో మురారిలో పెళ్లి పాట ఊహించుకుంటోంది అని నా ప్రగాఢ నమ్మకం.
విజయవాడ వచ్చేసింది. నా ఇందుని చూసే టైం వచ్చేసింది. నాలో ఏదో తెలీని ‘శక్తి’ ఉందని నాకనిపించింది. ఇంకాసేపు ఉంటె మగధీరలో రాంచరణ్ లాగ అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరినీ తాకి ఇందు, ఇందు అని అడిగేవాణ్ణి. నేను బామ్మ వెనకాలే కొరివి దయ్యంలా వెళ్తున్నాను. ఇంతలో “బామ్మా” అని వెనక నుండి ఎవరో మగవాళ్ళ పిలుపు. కొంపదీసి ఇందు కాకుండా వాళ్ళ అన్నో,తమ్ముడో రాలేదు కదా అనుకున్నాను. ఈవిడ వెనక్కి తిరిగింది. నేను జాగ్రత్తగా అదే యాంగిల్ల్లో తిరిగాను. “ఇదే బాబు మా ఇందు” అంది ఆవిడ నా దీపం ఆర్పేస్తూ. అహ నా పెళ్ళంటలో నూతన్ ప్రసాద్లాగా మా అమ్మకు కావాల్సింది అల్లుడు కాదు..కోడలు..అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను.
బాపు-రమణ

(బాపు బొమ్మల ప్రదర్శన కావూరి హిల్స్ లో జరుగుతోంది.దాని గూర్చి పత్రికలో చదివి ఆవేశంతో రాసిన ఈ వ్యాసం.)
(పైన బొమ్మలకి కాపి rights ఉండి ఉల్లంఘించినట్లు అయితే దయచేసి క్షమించగలరు.)
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందానో కలే కల్లలయ్యే వేళ…
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందానో కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతానో!!
http://songbuzz.rediff.com/songs/#!/rangam
ఆటోప్సి!
“నా బిడ్డ కి ఎట్లున్నది సారూ?” ఎవరో ఒకావిడ అడుగుతోంది. నలిగిపోయిన చీర కట్టుకుని, దాంతోనే చెమట తుడుచుకుంటోంది..మొహం మీద ఉన్న ముడతలు, సన్నని దేహం-తన వాలకం చూస్తుంటే వయసు యాభై పైనే ఉండి ఉండొచ్చు అనిపిస్తోంది. చీర, చెప్పులు చూస్తుంటే పేదవారనిపిస్తోంది.
“ఏం సారూ..ఏం అనవు..”
“కొంచం సీరియస్ గానే ఉంది.” ఈ మాట ఎలా చెప్పానో నాకే తెలీదు..
“గంటె ఏంటి సారూ..” ఆమె కళ్ళు నిండుగా ఉన్నాయి..
“నువ్వే ఏదన్న జేసి…”
“పెద్ద డాక్టర్ వస్తాడమ్మా..” అని తనని మధ్యలో ఆపి చెప్పాను..
“చిన్న దేవుడు..పెద్ద దేవుడు ఉంటాడా సారు. నువ్వే దయ సూపీ..ఆడి ఊపిరి ఆగనివ్వకు..నీకు దణ్ణం పెట్టుకుంటా..” ఎడ్చేస్తోంది..
నేనేమో ఇక్కడ హౌస్ సర్జన్సీ కోసం వచ్చాను..నేనేం చెయ్యగలను..మహా అయితే రంగం సిద్దం చెయ్యగలను..మిగితావన్నీ పెద్ద డాక్టర్లే చెయ్యాలి. ఆయనకి కాల్ చేసి పిలుద్దాం అనుకుని ఆవిడకి చూస్తానులే అని చెప్పి లోపలకి వచ్చాను..
“ఎస్ సర్..in a moment.”
******

సర్జరీ పూర్తి అయ్యింది. అతను చనిపోయాడు.
“మీరొక పని చెయ్యండి. ఈ అబ్బాయి తాలూకు వాళ్ళతో జరిగిన విషయం చెప్పండి..ఆటోప్సికి రెడీ చేసి పాతోలోజీ ల్యాబ్ వాళ్ళకి కూడా ఇంఫారం చెయ్యండి. సీనియర్లు ఉంటారు కదా..వాళ్ళని అడగండి..ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తారు..” డాక్టర్ గారు నాతొ చెప్పారు.
“సర్..వాళ్ళ అమ్మకి… నేను…” ఈ చావు వార్త ఎలా చెప్పాలో నాకు అర్ధం కావటం లేదు..చాలా సార్లు విన్నాను ఇలా సీనియర్లు “చావు కబురు మీరే బంధువుల చెవిలో వెయ్యండి” అని చెప్తారని. ఈయన కూడా అలాగే చెప్పారు..
“అరుణ్..పర్సనల్ గా తీస్కోకండి..ఇలాంటివి జరుగుతూ ఉంటాయి..మనం మన సాయసక్తులా ప్రయత్నించాం..అసలు చాలా మేజర్ ఆక్సిడెంట్ అండి ఇది..”
“ఓకే సర్..”
“వాళ్ళకి చెప్పేసి మిగితా పనులు చూడండి.. ప్రాక్టికల్ జరగట్లేదు అని మెడికల్ కాలేజీ నుండి కంప్లైంట్ ఉంది..దాని గూర్చి రిపోర్ట్ ఇస్తాడు శేఖర్..మీరు సాయంత్రం వచ్చినప్పుడు నాకు తెచ్చి ఇవ్వండి”
శేఖర్ మెడికల్ కాలేజీ ప్యూన్. నేను రోజూ సాయంత్రం డాక్టర్ గారి ఇంటికి వెళ్లి పీజీ ఎంట్రన్సు టెస్ట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాను.
“ఓకే సర్..”
బయట ఆవిడతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బహుశా తోడూ వచ్చారు అనుకుంటాను.
“చిన్న సారు వచ్చిండు..” అని ఎవరో చెప్పంగానే నా దెగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు..
“మీ అబ్బాయే కదండీ..” తెల్సే అడిగాను..
“అవును సారు..”
“అతను..అతనికి..” మాట రావట్లేదు..
“పెద్ద ఆపరేషన్ చెయ్యాలి అని పెద్ద డాక్టేరు చెప్పిండు..చేసిన్రా?”
“అవును..పెద్ద ఆపరేషన్ చెయ్యాలి..”
“చేసెయ్యి సారు.” వాళ్ళ అమ్మ అంటోంది.
“లేదు చేసేసాము..” దేవుడా!..ఎందుకు ఇంత కష్టమైన పని నాకు ఇచ్చారు అనుకున్నాను..
“ఎట్లుంది నా బిడ్డకి..”
“అతనికి చాలా దెబ్బలు తగిలాయి కదా..”
“అవు సారు..మీదికెల్లి కప్పు కూలిపోయింది..నెత్తి మీదే పడ్డాయి ఇట్కెలు..”
“అవును..అందుకని అతనికి స్కల్ ఫ్రాక్చర్ అయ్యింది..అందుకని..”
“గంటె ఏంటి?”
“అంటే నా ఉద్దేశం..పుర్రె ఉంటుంది కదా..అది పగిలింది..”
“గప్పుడు ఏం జేస్తరు..” ఎవరో అడిగారు..
“పెద్ద ఆపరేషన్లా గా పుర్రె పలిగిన చోట్ల కుట్లేసి ఉంటరు..” ఇంకెవరో చెప్పారు..
“లేదు అలా చెయ్యరు..అంటే చెయ్యలేరు..”
నన్నే అందరు ఆత్రంగా ఏం చెప్తానో అని చూస్తున్నారు..
“చూడమ్మా..అతనికి దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి..అందుకే అతన్ని బతికించటం చాలా కష్టమైన పని..అది మావల్ల కాలేదు..” ఎలా చెప్పానో తెలీదు కాని చెప్పేసాను..
“గంటె మా బిడ్డ..”
“చనిపోయాడమ్మ” నా గొంతు మారింది.
నాకు చాలా బాధగా అనిపించింది. పాపం ఇంకెవ్వరు లేనట్టున్నారు తనకి..ఏం చెప్పి ఒదార్చగలను?..ఆటోప్సి గూర్చి గుర్తుంది..ఆవిడని కదల్చటం ఇష్టం లేక ఊరకున్నాను. ఇంతలో వాళ్ళలో ఒకాయన వచ్చి బాడీని తీసుకువెళ్తాం అని అడిగాడు. ఆ అబ్బాయికి తాత అంట.
“చూడండి..మనిషి చనిపోయాక కొన్ని పద్ధతులు ఉంటాయి..మీరు ఒప్పుకుంటే..”
“ఆడి పేనమే పొయ్యాక ఇంకేం ఉంటాయ్ సారు..”
“అదే.. పోస్ట్ మొర్టెం అంటారు..అది చేసి మీకు అతని శరీరాన్ని అప్పగిస్తాము..”
“గంటె ఏం జేస్తరు..మల్ల బతుకుతడా?” కంగారు పడుతున్నాడు.
“అతను మళ్లీ బ్రతకడు అండి..” వీళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు..”ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు..ఇవన్ని చూసి మీకు అతని డెత్ సర్టిఫికేట్ ఇస్తాము..”
ఏం అర్ధం అయ్యిందో ఏంటో..వెళ్ళిపోయాడు..ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు..
ఏడుపు ఆపి కాసేపు మాట్లాడుకుని ఆటోప్సి చెయ్యమని చెప్పారు. బాడీని తీస్కుని ల్యాబ్ కెళ్ళాను. పాథోలోజి ఆయన ఒకరు వచ్చారు. మొదలుపెట్టారు.
*****
“ఎలా చనిపోయాడు అని వాళ్ళు అంటున్నారు?”పాథోలోజిస్ట్ ప్రశ్న.
“తల మీదకి పైకప్పు కూలింది అంటున్నారండి. అప్పుడు స్కల్ బోన్ విరిగింది. అందుకే చనిపోయాడు అని అనుకున్నాము..ఇప్పుడేమో ఇలా..”
“ఓకే సర్..”
“మీరెన్ని అయినా చెప్పండి..అలా చెయ్యటం తప్పు..” కాస్త కఠినంగా చెప్పాను.
“పోలీసులకి చెప్తాను జాగ్రత్త!” ఇప్పుడు తగ్గుతారు అనుకున్నాను..కాసేపు ఊరుకున్నారు..
నాకు మాట పడిపోయింది…చుట్టు పక్కల చూసాను. అక్కడి నుండి వెళ్ళిపోదాం అనిపించింది. నిజంగానే వెళ్లి పోలీసులకి చెప్పేద్దామా అనుకున్నాను..నన్ను,నా వాళ్ళని ఎమన్నా చేస్తే??
అనవసరంగా తల దూర్చాను అనిపించింది. వాళ్ళు కూడా నన్ను చూసి పోలీసులకి చెప్పేస్తానేమో అని బెదిరినట్టున్నారు..
“సూడు బిడ్డా..ఆడి రోగానికి పెట్టనికి మా కాడ పైసల్ లేవు..ఆడు చస్తే గా మేష్ట్రి పైసల్ ఇస్తడు. గందుకే గాన్ని జంపినం. ఏరే దారి లేకుండే..మేము శాన బీదోల్లం. తిననికి కూడా లేక 2 -3 నెలలు మాడినం. ఆడి చెల్లి పెళ్లికి మస్తు డబ్బులైతై. ఏడికెల్లి తెస్తం?గేట్లైన ఆడు సావనికే పుట్టిండు..గదేదో మాకు సాయం ఐతదని గిట్ల జేష్నం.”
కాసేపు అయ్యాక మళ్లీ ఆయనే చెప్పటం మొదలుపెట్టాడు “గయినా సచ్చుడు ఆనికి కూడా ఇష్టమే. ఆడు చెప్పిండనే సంపినం. ఇంక జబ్బు ముదిరినాది..పన్లోకి పోలేను..రేపటి సంది ఇంట్లనే పండాలి..నన్ను ఇయ్యలె సంపు తాతా అంటే కడుపుంత ఎడ్షిన. అమ్మకి తెల్వనీకు,అది కూడా నాతొ సస్తది, నువ్వే చెప్పు అని బిడ్డ అంటుంటే నాకే సావు రానందుకు దేవుణ్ణి తిట్టిన. ఆడు సంపు, సంపు అని నన్ను మాటల్తో సంపుతుంటే నేనే బండ లెక్క మారి ఆడి నెత్తి మీద బండ వెట్టి కొట్టిన. ఎత్తి తిప్పిన సేతుల్తోనే ఎత్తి కుదేసిన. ఆడు మామూలుగా జస్తే పైసల్ రావు. గిట్ల పన్ల జస్తేనే ఒస్తయ్. గా పిల్ల మొకం జూసి అయిన మార్చి రాయి బిడ్డా..నీ కట్టం ఉంచుకోము..”
నా బుర్రలో ఏదో సుడిగుండం మొదలు ఐపోయింది..కాసేపటికి సీనియర్ వచ్చారు..ఆయన రాకపోతే ఈ ఆలోచనలతో నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి.
“ఏంటి అరుణ్…ఎనీ ప్రాబ్లం?”
పక్కకి తీస్కెళ్ళి మొత్తం చెప్పాను..
“పాపం వాళ్ళ మొహం చూస్తుంటే జాలి వెయ్యట్లేదా అరుణ్ నీకు? మార్చి రాసేద్దాం..వాళ్ళకి ఉపయోగపడే పనే కదా మనం చేస్తున్నది..!ఆ సర్టిఫికేట్ పని,అది కూడా కొంచం తొందరగా చేసేద్దాము”
“పాపం పిల్లాడ్ని అన్యాయంగా చంపేసారు కదా సర్..”
“వాళ్ళ పిల్లాడు, వాళ్ళ ఇష్టం..”
“అసలు ఎలా నమ్ముతున్నారు సర్ మీరు..వాళ్ళు వేరే స్వార్ధానికి చంపేసి ఉంటే? పోనీ నిజమే అయినా కూడా అసలు ఇది ఇలా వదిలేస్తే రేపటి నుండి ఇలాంటివి ఇంకెన్ని చావులు చూడాలి మనం?”
“ఆవేశపడకు అరుణ్..మన దేశంలో ఎన్ని కేవలం ఒకరి స్వార్ధానికి జరగట్లేదు? వీళ్ళు పేద వాళ్ళు..దీని వాళ్ళ లాభపడుతున్నారు..మనం సాయం చేస్తే ఆదుకున్న వాళ్ళం అవుతాము..వాళ్ళకి లాభము..మనకి పుణ్యము..”
“సర్..” నేను ఆశ్చర్యపోయాను..ఇందులో మళ్లీ సమాజ సేవా?!
“ఈ అబ్బాయి ఆ అరుణ లాగా ‘vegetable ‘ కాదు సర్..రోజూ పనిలోకి వెళ్ళే అబ్బాయి..పైగా వీళ్ళు నిజమే చెప్తున్నారు అని నమ్మకం లేదు కదా!”
“అరుణ్..కొంచం సేపు మనసుతో ఆలోచించు..ఏం అనిపించకపోతే నేను చెప్పింది చేసెయ్యి..నేను వెళ్ళాలి..” ఆయన వెళ్ళిపోయాడు. మరి నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేకో,ఏమో నాకు అసలు మనసే లేదు అనుకున్నాడు. నాకెందుకులే అని నేను సరిపెట్టుకున్నాను. వెళ్లి సర్టిఫికేట్ వాళ్ళకి కావల్సినట్టే ఇస్తాము అని చెప్పాను. వాళ్ళు ఆనందంతో నా కాళ్ళు పట్టుకున్నారు. ఆ పెద్ద మనిషి దణ్ణం పెట్టి నేను దేవుడిని అన్నాడు. ఇంతలో ఆ పిల్లాడి శవం తీస్కోచ్చారు. ఈ సారి నిజమైన కన్నీరు కారుస్తున్నారు అందరు. వాడి నొసటి మీద ముద్దు పెట్టుకుని దెగ్గరికి తీస్కున్నాడు వాళ్ళ తాత. ఆ కళ్ళలోంచి ప్రేమ కట్టలు తెంచుకుని ధార లాగా కారుతోంది.
పశ్చాత్తాపం!
“ఏంట్రా సంగుతులు..ఈ మధ్య కనిపించటం మానేసావు?” అని అడిగాడు రొప్పుతూ.
నేను తలదిన్చుకున్నాను. వెళ్ళిపోతా అని తెల్సేట్లు గడియారంవైపు చూస్కున్నా.
“పని ఉందా? తర్వాత మాట్లాడనా?”
“అవును, తర్వాత కలుద్దాం” అనేసి వడివడిగా అడుగులు వేస్కుంటూ అక్కడనుండి వచ్చేసాను.
అసలు జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏమిటో తెల్సా మీకు? మనం తప్పు చేసినప్పుడు, ఆ తప్పు పర్యావసానం మన సన్నిహితులు అనుభవించినప్పుడు, అది మన వల్లే జరిగింది అని వాళ్ళకి తెలీక వాళ్ళు మనని అభిమానంతో చూసినప్పుడు. అసలు మనస్సాక్షి అన్నదే లేని వాళ్ళని పక్కన పెట్టేయండి. అది ఉన్నవాళ్ళ పరిస్థితి నరకం. వాడికి నిజం చెప్పి సారీ చెప్పమని నా బుద్ధి చెప్తోంది. ఒక్క సారీతో చేసిన పాపం పోతుందా, పాపం ఎంత యాతన అనుభవించాడో కదా, నిన్ను అస్సలు క్షమిస్తాడా? అని మళ్లీ తనే కడిగేస్తోంది. ఏం ఆలోచించకుండా ఉందాం అంటే కుదరట్లేదు. విసుగు వచ్చేస్తోంది. ఇంతలో నా పక్కనుండి నా లాంటి మనిషే ఒకడు వచ్చాడు.
“ఎవరు నువ్వు? నాలాగే ఎందుకు ఉన్నావు?” అని అడిగాను.
“నేను నీ అంతరాత్మని రా ఫూల్. సినిమాలు చూడవా?”
“ఓహ్ నువ్వా..చెప్పు ఎందుకొచ్చావు?”
“ఎందుకురా అంత బాధపడతావు..తప్పు ఒప్పెస్కో..చెప్పేసెయ్ వాడికి,ఇది చాలా కామన్!”
“సర్లే..నువ్వు అలాగే చెప్తావు..వాడ్ని పేస్ చెయ్యాల్సింది నేను”
“మరి తెల్సే ఆ తప్పు చేసావు కదా..ఎందుకు చేసావు రా?నేను చెప్పినా వినలేదు నువ్వు..”
ఈ అంతరాత్మ కూడా భలే గడుసు అసలు. తప్పు చేసేటప్పుడు నెమ్మదిగా చెప్తుంది. తప్పు జరిగిపోయాక గట్టిగా చెప్తుంది.
“బుద్ధి గడ్డితిని..ముందు జరగాల్సింది చూడు”
“చెప్పకుండా ఉండలేవు.చెప్పకపోతే మటుకు ఇట్లా బాధపడుతూనే ఉంటావు. చెప్పేసి లటుక్కున కాళ్ళు పట్టేస్కో!”
“చస్తానా?”
“మరి ఫోన్ చెయ్యి, కలువు వాణ్ని” నా అంతరాత్మ వెళ్ళిపోయాడు.
అరుణ్ కి ఫోన్ చేశా.
“రేయ్..నిన్ను కలవాలి..కొంచం అర్జెంటు” అన్నాను.
“ఓకే రా..లైబ్రరీ కి వచ్చేయ్. బయట ఉంటాను.”
***
వాడు కనిపించంగానే వాడి కాళ్ళ మీద పడిపోయా.
“ఏంట్రా ఇది?”
“రేయ్ అరుణ్..నువ్వు నన్ను క్షమించాలి..”
“దేనికి రా”
“ఏంట్రా?”
“నేనే తెల్సి తెల్సి మీకు శక్తి సినిమా టికెట్స్ ఇచ్చాను”
వాడి మొహం సీరియస్ గా ఐపోయింది. నేను వాణ్ణి అలా చూడటం అదే మొదటిసారి.
“నువ్వు చెప్పేది నిజమా?”
“నిజమే రా”
“ఎందుకు రా అలా చేసావు?”
వాడు ఇంకా తేరుకోలేదు. కాసేపు ఆగి..
“రేయ్..నా డబ్బులకి బొక్క పడుతుంది, ఆ సినిమా టికెట్ అమ్మిపెట్టరా అంటే నేనే మా ఆఫీసులో అమ్మేవాడ్ని కదరా? ఎందుకు రా ఇలా చేసి మన స్నేహాన్ని అవమానపరిచావు ?” తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ లాగ భలే డైలాగ్ వేసాడు వెధవ.
“అది కాదు రా..నువ్వైతే ఏదన్న పాజిటివ్ గా తీస్కుంటావు కదా అని..”
“మాట్లాడకు!”
నన్ను మూస్కోమని వాడు మూస్కొని వెళ్ళిపోతున్నాడు. శక్తికి ఇంత శక్తి ఉంటుందని అనుకోలేదు.

ఇటీవలి వ్యాఖ్యలు