అంతర్మధనం

నవంబరు 3rd, 2009 § అభిప్రాయములు

దాని ఊసే తెలియని మనసులో పుట్టింది ఇది

పంకం లోంచి వచ్చే పద్మం లా..

మరెన్నో భావనల్లో నుండి వెలుగు చూసింది

మబ్బులు చీల్చుకుని వచ్చే సూర్యకిరణం లా..

చెక్కిలి లోగిలిలో వెచ్ఛటి తడి కల్లాపి జల్లి..

పెదవులపై వెలిసింది ముత్యాల ముగ్గు లా..

వేరైన రెండు మనసులను కలిపి ఒక హారం అల్లి

ఏ కల్మషం లేక నవ్వింది పల్లె పడుచు సిగ్గు లా..

తోడు లేని నడక అలుపు అంటూ,

ఒంటరిగా మోయలేని బతుకు  బరువు అంటూ ,

ఆరాటపడుతున్న మనసుని,మొహమాటపడుతున్న బుద్దిని

నేర్పుగా నడిపింది ఒక సారధి లా..

కలహాలు వచ్చినా, విరాహాలు పెరిగినా,

నేనున్నా అంటూ కలిపింది ఒక వారధి లా..

మాటలకి అందనిది,

ఏ ఒకరికి చెందనిది,

అంతం అంటూ లేనిది,

వృధ్యాప్యం రానిది.

ప్రేమ కాదిది..

వాంఛ కాదిది..

ఒక పేరంటూ లేదు దీన్ని పిలవటానికీ,

ఎన్ని యుగాలు ఐనా సరిపోవు దీన్ని మరువటానికి.

Tagged: ,

§ 12 Responses to అంతర్మధనం

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

What’s this?

You are currently reading అంతర్మధనం at ఓ "గాలి" కబుర్లు:).

meta

Follow

Get every new post delivered to your Inbox.