గోదావరి ఎక్స్ ప్రెస్
మే 3rd, 2010 § అభిప్రాయములు

“దయచేసి వినండి..ట్రైన్ నంబరు 7008 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన గోదావరి ఎక్ష్ప్రెస్స్ ఒకటవ నంబరు ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకు సిద్దంగా ఉన్నది“
అనౌన్సుమెంట్ విని ఈ లోకానికి వచ్చాను. హైదరాబాదు, విశాఖపట్నం రెండూ నాకు ప్రియమైన ఊర్లే. విశాఖపట్నం నాకు జన్మనిచ్చి, విద్యనిచ్చిన పుట్టినిల్లు అయితే హైదరాబాదు జీతమిచ్చి అన్నం పెడుతున్న మెట్టినిల్లు. అటువంటిది ట్రైను ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు విశాఖపట్నం జేరుతానా అని అసహనంగా ఎదురు చూడసాగాను. సొంత ఊరు కన్న తల్లి వంటిది అని ఎవరో మహానుభావులు అన్నారు. నిజమే అనిపించింది. తన ఒడ్డున కూర్చోబెట్టుకుని ఆ మహా సముద్రం నాతో ముచ్చట్లాడిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. తన వైపు తదేకంగా చూస్తూ ఉన్న నా కళ్ళను బట్టి నా మనసు అర్ధం చేసుకొని బంగాళాఖాతం తన హోరుతో ఊకొట్టేది. ఎగసిపడుతున్న ప్రతి అల నాకు ఒక స్నేహితుడిలా కనపడేది. “ఒక్కడివే ఆ దిక్కుమాలిన బీచ్ లో అంత సేపు ఎలా కూర్చుంటావురా?” అని నాన్న అడిగితే నవ్వుకునేవాడిని. ఊరు చేరంగానే ఒకసారి సముద్రతీరానికి వెళ్లి, నా ఈ కసి అంతా తన దెగ్గర వెళ్ళగక్కుదామనుకున్నాను.
ట్రైను నెమ్మదిగా కదిలింది. నా జ్ఞాపకాలు కూడా. కీర్తి నాకు మూడేళ్ళుగా తెల్సు. మా ఇద్దరికీ పెళ్ళయ్యి నాలుగు ఏళ్ళు అయ్యింది. అలా ఎందుకు అన్నాను అంటే తనని తనుగా నేను అర్ధం చేస్కోగలిగింది మూడేళ్ళనుంచే. అసలు ఒక మనిషిని అర్ధం చేస్కోవటం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే, ఏ సంఘటనలో అయినా ఆ మనిషి ఎలా స్పందిస్తాడో ఊహించగలిగితే చాలు,అర్ధం చేస్కున్నట్టే అని నేను నమ్ముతాను. అలా నేను కీర్తిని మా పెళ్లి అయిన ఏడాదికి కానీ అర్ధం చేస్కోలేకపోయాను. బహుశా మొదట్లో పరాయింటికి వచ్చిన ఆడపిల్ల కదా! ఆ మొహమాటము, బిడియము వల్లేమో, సరిగ్గా తెలుసుకోలేకపోయాను.
ట్రైను వరంగల్ దాటింది. కీర్తి ఇక్కడే REC లో ఇంజనీరింగ్ చదివింది. నాతో సరితూగే పిల్ల కావాలని అమ్మ ఏరికోరి కీర్తి సంబంధం కుదిరించింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావటంతో తన పేరు, గోత్రం, నక్షత్రం, ఇష్టమైన సినిమాలు తదితర విషయాలు తప్ప మరేమీ పనికొచ్చే విషయాలు తెలుసుకోలేకపోయాను. చురుకైన పెద్ద కళ్ళు, పొడవాటి ఒత్తైన జడ, తెల్లటి అందమైన పాదాలు, ప్రసన్నమైన ముఖం – ఇవి కీర్తిని చూడంగానే నన్ను ఆకట్టుకున్నవి. ఈడు-జోడు బాగుంటుంది అని ఇంట్లో అనుకుంటూ ఉండంగానే నేను సరే అనటంతో అందరూ సంబరపడిపోయారు. పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి.
విజయవాడ వచ్చినట్టుంది. టైము పదకొండు దాటింది. భోజనం చెయ్యలేదు అని గుర్తురాగానే ఆకలి వేసింది. ఏమైనా కొనుక్కుందామని కిందకి దిగాను. ఒక ఇడ్లీ ప్యాకెట్ కొనుక్కుని తిరిగి నా సీట్లో కూర్చుకున్నాను. నేను కిందటిసారి విజయవాడ నా పెళ్ళప్పుడు వచ్చాను. లక్షలు పోసి ఆర్భాటంగా చేస్కునే పెళ్లి అనే పండగ అంటే నాకు మక్కువ లేదు. ఎందుకంటే పెళ్ళికి ముహూర్త బలం మాత్రం చాలు అని నేను నమ్ముతాను. కానీ స్థాన బలం కూడా కావాలి అని కీర్తి వాళ్ళ నమ్మకం అనుకుంటాను. అక్కడ ఏదో ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసారు. ఒక్కడ్నే కొడుకుని కావటంతో మా అమ్మ,నాన్న కూడా నా పెళ్లి వైభవంగా జరగాలని నన్ను ఒప్పించేసారు. అలా మా పెళ్లి జరిగిపోయింది.
రైలు బయలుదేరింది.కూర్చుని కూర్చుని నడుము నొప్పిగా ఉండటంతో నెమ్మదిగా వెనక్కి వాలాను. కీర్తి గూర్చి తలుచుకుంటుంటే అసలు కునుకన్నదే రావట్లేదు. తను చెడ్డది కాదు. అలాగని నాకు మంచిది కాదు. మేము పరస్పరం తగము అంతే. మా ఇద్దరి ఆలోచనల్లో అంత తేడా ఉంది. చల్లటి సాయంత్రం వేళ ఏ పార్క్లోనో నడవాలని నేను కోరుకుంటాను. అదే సాయంత్రం తను మా కారులో షికారుకెళ్ళాలంటుంది. బయట వాన పడుతుంటే బండి దగ్గర వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలి అని నా మనసు కోరుకుంటే తను డామినోస్ పిజ్జా తినదామంటుంది. నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఎవరైనా పెద్దవారికి సీట్ ఇచ్చినా అది వారికి సాయపడినట్టే అనుకుంటాను. తను బస్సు ఎక్కదు..ఎక్కినా ఆ సీట్ న్యాయంగా తనదే కాబట్టి లేచి మరొకరికి ఇవ్వదు. ప్రేమతో కొనిచ్చేది ఒక్క గ్రీటింగ్ కార్డు అయినా చాలు అని నా అభిప్రాయం. గిఫ్ట్ అంటే వేలు పోసి రిస్ట్ వాచో, ఐపాడో కొనివ్వడం తన సంప్రదాయం. ఇలా మా ఇద్దరి మద్య వ్యత్యాసాలు రోజులు గడిచే కొద్దీ అడ్డు గోడల్లా కనిపించసాగాయి.
రైలు మళ్లీ ఆగింది. తాడేపల్లిగూడెం అనుకుంటాను. ఎవరో దంపతులు ఇద్దరు మా కంపార్ట్మెంట్ కి వచ్చి కూర్చున్నారు. అందులో అమ్మాయిని చూస్తే ఆ రోజు పొద్దున్న జరిగిన గొడవ జ్ఞప్తికి వచ్చింది. పదిహేనేళ్ళ బీమా నా పెళ్లి కాకముందు మా ఇంట్లో పనిమనిషి. చదువంటే తనకి ఎంతో ఇష్టం . తనని చదువు మానిపించి బలవంతంగా పెళ్లి చేస్తుంటే, వద్దని వారించి చదువుకి అయ్యే ఖర్చు భరిస్తాను అని మాట ఇచ్చాను. ఆ రోజు ఉదయం బీమా డిగ్రీ తీస్కుని కృతజ్ఞతలు చెప్దామని ఇంటికి వస్తే, కీర్తి తనని చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయికి చదువు మేము పెట్టిన భిక్షే అన్నట్టు మాట్లాడింది. దాంతో ఆ అమ్మాయి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. కోపమొచ్చి కీర్తిని నేను మందలించాను. మాటకి మాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. విపరీతమైన కోపంతో అక్కడినుండి ఆఫీసుకి వచ్చేసాను. అక్కడ కూడా ఉండబుద్దికాక ఇండెఫినెట్ లీవ్ పెట్టి విశాఖపట్నం బయలుదేరాను.
రాజమండ్రిలో ట్రైన్ ఆగింది. నా ఆలోచనలు కూడా ఆగాయి. ఇక తనతో కలిసి ఉండలేనని తనతో చెప్పేద్దాం అని నిర్ణయించుకున్నాను. మొదట తను బాధపడుతుంది ఏమో అని అనిపించింది. కానీ నా ఆదర్శాలకి విలువివ్వని మనిషితో జీవితాంతం కల్సి ఉండటం కష్టం అని తోచింది. కాబట్టి తను బాధపడినా సరే విడిపోవాలని అనుకున్నాను. తను మటుకు నన్ను ఎప్పుడు బాధపెట్టలేదా ఏంటి అని ఉక్రోషంతో నా మనసు ఉడికింది.
రైలు సామర్లకోట జేరింది. కాకినాడ వెళ్లేందుకు ఇక్కడ మారవలెను అని రాసుంది. చేరవలసిన గమ్యం ఒక్కటి కానప్పుడు కల్సి ప్రయాణం చెయ్యలేము అని మరొకసారి నాకు నేను చెప్పుకున్నాను. ఒక అమ్మాయి మనకి తగినదో,కాదో తెలుసుకోవాలి అంటే కచ్చితంగా తనతో ఉంటేనే కాని తెల్సుకోలేము, అందుకనే ప్రేమ వివాహం సరైనది అని నా స్నేహితుడు అనేవాడు. అమ్మాయిలంటే వస్తువులు కాదు, ఒకసారి ట్రై చేసి నాకు నచ్చలేదు, నప్పలేదు అని పక్కన పెట్టేయ్యటానికి అని నేను అనేవాడిని. ఇప్పుడు వాడన్నదే సబబుగా అనిపిస్తోంది. కీర్తి ఇలా ఆలోచిస్తుంది అని తెలిసి ఉంటే నేను ముందుగానే తప్పుకునే వాడ్ని.
అన్నవరం జేరాను. అది కీర్తి వాళ్ళ స్వస్థలం. వాళ్ళ నాన్నకి ఏవో వ్యాపారాలు ఉండి విజయవాడ లో స్థిరపడ్డారు. అసలు డాబు, దర్పం చేసేపనుల్లో చూపించాలి అన్న వాళ్ళ ఆలోచనకి నేను మొదట నవ్వుకున్నాను. కూతుర్ని ఇలాగేనా పెంచేది అని నా మనసులోనే వాళ్ళని నిందించాను. ఒక్కసారి అయినా కారు అద్దాల వెనక ఉన్న ప్రపంచం చూపించారు కాదు అని తిట్టుకున్నాను. కీర్తిని తలుచుకుంటే నాకు అప్పుడు జాలి వేసింది. బహుశా వాళ్ళు అలా పెంచి ఉండకపోతే తను అలా ఉండేది కాదేమో అనిపించింది. ఏదో సినిమాలో చెప్పినట్టు చెట్టుని బట్టే కాయ ఉంటుంది. నాకు అందిన కాయ రుచించట్లేదు. ఏమిటో నా ప్రాప్తం అని నిట్టూర్చాను. ఇందాక ఎక్కిన దంపతులు ఏవో తర్జనభర్జనలు పడుతున్నారు. వాళ్ళు తెచ్చుకున్న మూట కనిపించట్లేదుట. బండి ఎక్కినవెంటనే ఆ మూటను పైన పెట్టారని నేను గమనించాను. ఆ విషయం వాళ్ళకి చెప్పాను. అది చూస్కుని ఇద్దరూ కుదుటపడ్డారు. పాపం ఆ అమ్మాయికి ఏదో హృద్రోగం ఉందిట. అందుకని జీవితాంతం ఆ అమ్మాయి ప్రతి మూడు నెలలకి ఏదో ఖరీదైన ఆపరేషన్ చేయించుకోవాలిట. ఆ ఆపరేషన్ కోసమే వైజాగ్ వెళ్తున్నారుట. మరి కష్టంగా లేదా అని అడిగాను. అది ఆ బంధంతో పాటు వచ్చిన తన బాధ్యత అని సంతోషంగా చెప్పాడు అతను. ఆశ్చర్యపోయాను. “అవునండి, కాస్త కష్టంగానే ఉంది” అని అంటాడేమో అనుకున్నాను. ఆమె హృదయానికి శారీరకంగా ఉన్న రోగానికిగాను అతను జీవితాంతం మందులిప్పిస్తున్నాడు. నా భార్య కి మానసికంగా ఉన్న రోగానికిగాను నేను తనని జీవితాంతం నా నుంచి దూరం చేసేస్కుంటున్నాను. ఇది సబబు కాదు అని తోచింది. తనకి మందు ఇవ్వకుండా శిక్ష వేస్తున్నాను అనిపించింది.
రైలు విశాఖపట్నం జేరింది. చెయ్యవలసిన పనిని మరొక్కసారి నాకు నేను గుర్తుచేస్కున్నాను. ఇల్లు జేరాక హైదరాబాద్ ఫోన్ చేశాను. కీర్తి మాట్లాడింది.
“అయినా ఎంటండి..రాత్రంతా ఇంటికి రాలేదు. సెల్ కూడా ఆఫ్ చేసారు. ఎవరిని అడిగినా తెలీదు అన్నారు. ఎంత కంగారేసిందో”
“సారీ..అర్జెంటుగా బయలుదేరాను. నీకు చెప్పి ఉండాల్సింది.”
“గొంతు అలా ఉందేమిటి? బడలికా? లేక రాత్రి AC పడలేదా?”
“అదేం లేదు..నేను స్లీపెర్ లో వచ్చాను..కొద్దిగా అలసిపోయాను అంతే”
“స్లీపెర్ లో వెళ్ళారా? మనకేం ఖర్మ?”
చిన్నగా నవ్వుకున్నాను.
bagundi. manasu pade tarjanabarganalanu baga choopinchav.
“స్లీపెర్ లో వెళ్ళారా? మనకేం ఖర్మ?”
చిన్నగా నవ్వుకున్నాను.
chala baga end chesav.
mee hero journey chaala bavundi. avesam numchi alochanaloki prayanam. chaalamandiki chaalasarlu ilantivi jarugutai. kakapothe, ila words lo pettatam chaala kastam.. great job.
hero, valla parents kante samudram tho affection ekkuva penchukotam.. konchem kotthaga vundi.
“కీర్తి నాకు మూడేళ్ళుగా తెల్సు. మా ఇద్దరికీ పెళ్ళయ్యి నాలుగు ఏళ్ళు అయ్యింది.” I liked this
A very very small continuity glitch: last lo, keerthi ki hero vizag vellaadani evvaru cheppakapoyina, telisipotundi.
@Naagas: కామెంట్ కి చాలా ధన్యవాదాలు
అక్కడ రాసి ఉన్నది వాళ్ళిద్దరి సంభాషణ లో ఒక భాగం మాత్రమే. “హైదరాబాద్ ఫోన్ చేశాను. కీర్తి మాట్లాడింది” అన్నప్పుడు పలకరింపులు జరిగిపోయాయి అని నా భావం:) అందుకే తన డైలాగ్ ను “అయినా ఎంటండి..?” తో మొదలుపెట్టాను.
@Ambati: ధన్యవాదాలు!
So unfair Anu. Put in an English translation for folks like me too
Ni gaali kaburlu chala bagunnayi ..!
oka manishini ela ardam cheskovali ani chala baaga rasavu
చాలా బావుంది. naagas ఎంచిన లైన్ నాకు చాలా బాగా నచ్చింది!
ఒక మనిషితో స్పర్థలు వచ్చినప్పుడు తప్పదు అనుకుని ఉండటానికి, బాధ్యత తెలుసుకుని మసలడానికి తేడా చాలా బాగా రాసావ్.
కథలు రాయడం ఈ విత్తనంతో ఆపేయక రాస్తూ ఉండు
writing style is good, and even choice of words is good… but i feel that plot can be better, choice and expression of emotions is good complete with anecdotes , but in my opinion a person cannot have a change of heart with just one small incident, especially in relations..
after many days i read something good in telugu, keep up the good work…
Thank you
ఒక్క సంఘటన చాలు ఒక మనిషిలో ఆలోచన రేకెత్తటానికి అని నా అభిప్రాయం. ఆ ఆలోచన కలిగినందుకే తన నిర్ణయం గూర్చి మళ్లీ అలోచించి తన భార్యకి ఇంకో అవకాశం ఇచ్చాడు అన్నది నా భావం
@Pavan,Gopal: Thank you
@Nammu: Deeniki transliterate cheyyani version pettenduku choostanu
చాలా బాగుంది.
మీ బ్లాగు చదవడం ఇదే మొదటిసారి.
ఇవేమీ గాలి కబుర్లు కాదు. మంచి మాటలే.
బాగుందండి.
Hey bavundhi Anu…aa gradual transformation bavundhi aa manishi thinking lo…kani naa vaipu nunchi oka doubt…anthalone 2nd thought ichina manishi..entha sepu determined ga vuntada annadi…thappuga teeskovaddu..just naaku anipinchindhi ala…neways nuvvu rasina teeru naaku nachindhi ..keep going
@bonagiri,vibbu,shashank: Thank you
@Sushu: నా ఉద్దేశ్యం ప్రకారం అతను అంత దూరం ఆలోచించాక ఆవేశం చల్లారి పరిష్కారం కోసం ఆలోచనలో పడ్డాడు అని చెప్దామనుకున్నాను. దానికి ఆ దంపతులతో మాట్లాడటం హెల్ప్ అయ్యింది.
“తనకి మందు ఇవ్వకుండా శిక్ష వేస్తున్నాను అనిపించింది”. I like this and nice post.
heyy, Anu gud work! first of all title naku baaga nachindi, endukante maa puttinillu vizag. ( GODAVARI EXPRESS ani anukogaane evarikaina ventane guruthu vache destination ).
aalochanalo, vachina maarpula gurinchi baaga raasaru. good work! keep it up!
ఒక్కడివే ఆ దిక్కుమాలిన బీచ్ లో అంత సేపు ఎలా కూర్చుంటావురా?.
idi maa amma dialogue. nenu kooda first vizag station lo adugu pettagane, beach road bus lo mundu ga Rushikonda veltanu.