ఓ "గాలి" కబుర్లు:)

ఏదో సరదాకి..
“బాబూ..ఏ ఊరు వెళ్తున్నావు?” నన్నే ఎవరో అడిగారు.’అసలే కోతి. పైగా కల్లు తాగింది’ అన్నట్లు నేను అసలే తిక్క గాడ్ని. పైగా సాఫ్ట్వేర్ వెధవని. పైగా మళ్లీ మాంద్యం అంటున్నారు. పైగా పెళ్లి కూడా కాలేదు.విజయవాడ నాన్స్టాప్ లో నా పక్కన కూర్చున్న ముసలావిడ నన్ను ఆ ప్రశ్న అడిగితె నాకు తిక్క రేగింది. నాకు ఇప్పుడు క్విజ్ లో పాల్గొనే మూడ్ లేదని ఆవిడతో గట్టిగా పీక నొక్కి వక్కాణించి చెప్పాలనిపించింది. కాని నేను మర్యాద రామన్నని కాబట్టి “విజయవాడ” అని చెప్పాను.

“ఎక్కడ ఏమిటి విజయవాడలో?”

“పటమట”

“ఉద్యోగం చేస్తున్నావా? చదువా?”

“హైదరాబాదులో X అనే ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాను. దాని హెడ్క్వాటర్స్ అమెరికాలో ఉంది. శనాదివారాలు సెలవులు కాబట్టి ఇవ్వాళ కూడా సెలవు పెట్టి విజయవాడలో ఉన్న మా తల్లితండ్రుల దగ్గరికి వాళ్ళని చూద్దామని వెళ్తున్నాను. సోమవారం మళ్ళి తిరిగి వచ్చేస్తాను.” ఇంకేం అడుగుతుందో అని మొత్తం ఒకేసారి చెప్పేసాను.

నాకు మొదటినుండి ప్రయాణంలో పక్కన వాళ్లతో మాట్లాడే అలవాటు లేదు. “ప్రయాణీకులకు విజ్ఞప్తి. అపరిచులతో జాగ్రత్త..పరిచయస్తులు నిలువుదోపిడీ చేస్తే మీ ఖర్మ.. రైల్లో కిరోసిన్,ఫినాయిల్,హిట్ లాంటివి తీస్కెళ్ళద్దు. టపాసులు, అగరొత్తులు వెలిగించద్దు” అనే రైల్వే నినాదం చాలా శ్రద్దగా పాటిస్తాను. అందుకే ఎవరితో మాట్లాడకుండా హైదరాబాద్ సిటి బస్సులలో అమ్మాయిల్లాగా చెవిలో ఐపాడ్, అందులోంచి బయటకి వినిపిస్తూ “ఓహ్ కళంకిత..కళలకే అంకిత.., మెట్టెల సవ్వడి…ఒహ్..మెట్టెల సవ్వడి..” లాంటి హిట్ సాంగ్స్ వింటూ ఉంటాను. అసలు ఇవ్వాళ నా కోపానికి కారణం ఇంకోటి ఉంది. నాకు ఈ ఏడాది కూడా పెళ్లి కాకపోతే మా నాన్న “ఈ పిల్లాడికి పెళ్లవుతుందా?” అని సినిమా తీస్తాడుట. అది నా ఒళ్ళు మండటానికి కారణం.

నా దెబ్బకి పక్కన కూర్చున్న ఆవిడ  కొంచం సేపు ఏం మాట్లాడలేదు. కాసేపటికి:

“మా మనవరాలు కూడా ట్రై చేస్తోంది. కాంపస్ లో అవ్వలేదు ట. విడిగా ఎమన్నా కుదురుతుంది ఏమిటి మీ కంపెనీ లో?”

“అయ్యో, తప్పకుండా బామ్మగారు. తన పేరు, గోత్రం, ౨ రీసెంట్ ఫోటోలు, జాతకం నా మెయిల్ కి పంపమనండి..మిగితావి నేను చూస్కుంటాను” అని అన్నాను.

“ఏమిటో సరిగ్గా వినపడలేదు బాబు..మరోసారి చెప్పు”

“అదే రేస్యుమే అని ఉంటుంది బామ్మగారు..నాకు పంపమనండి..నా అడ్రస్ మీకు ఇస్తాను..” అని పేపర్ మీద రాసిచ్చాను.

“నీకేం శ్రమ కాదు కదా?ఇలా ప్రయాణంలో పరిచయం అయ్యి అడుగుతున్నాను అని ఏం అనుకోకు…మా ఇందు చాలా తెలివైన పిల్ల..కాలేజీలో కూడా దాన్ని అందరు  చాకు,బాకు,బేకు,కత్తెర అనేవారు..ఏమిటో దాని దురదృష్టం..ఇంకా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు..పిల్ల బాధ చూడలేకపోతున్నాం అనుకో..”

“మీరు మరీనండి..ఇందులో శ్రమ ఏం ఉంది..అయినా ప్రయాణీకులన్నాక ఆ మాత్రం సాయం చేస్కోకపోతే ఎలా చెప్పండి..నాకెందుకో మొదటినుండీ తోటి ప్రయాణీకులతో స్నేహంగా ఉండటం అలవాటు..”

“నువ్వు చాలా మంచి వాడిలా ఉన్నావు”

“కరెక్ట్ గా కాచ్ చేసారు.”

ఈలోగా మా బస్సు వాడు అత్యంత శక్తివంతమైన శక్తి సినిమా మొదలుపెట్టాడు. జూనియర్ ఎన్టీయార్ హిందీ మాట్లాడుతుంటే ఉదిత్ నారాయణ్ తెలుగులో పాట పాడుతున్నట్టు సొంపుగా ఉంది. అయిన ఏ సినిమా ఏస్తే నాకేంటి? నా ఇందు కూడా ఇల్లూ అంత అందంగా ఉండి ఉంటుంది అని కలలు కనసాగాను.

“అవును నిన్ను అమెరికా  పంపారా బాబు?”

అదేమిటో నాకు అర్ధం కాదు. సాఫ్ట్ వేర్ వాడు అన్నాక ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి అని, అక్కడ నయాగరా ఫాల్స్ దెగ్గరో, ఎవరిదో లిమో పక్కన నిలబడో చింతకాయల రవిలో వెంకటేష్ లాగ ఫోటోలు దిగాలని, అవే తెలుగు మాట్రిమనీలో పెట్టాలి అని ఎవరు రూల్ పెట్టారో కాని, ముందు వాణ్ణి వేసేయ్యాలి. అక్కడ శనాదివారాలు కూడా పని చేసి శోష వచ్చి ,వాడిచ్చిన డీఏ సరిపోక రాత్రి పస్తులున్నా సరే..అమెరికా వెళ్తేనే గొప్ప! అక్కడ తిరిగితేనే గొప్ప! అక్కడనుండి గిఫ్ట్స్ తెస్తేనే గొప్ప! నన్నేమో ఈ మాయదారి కంపెనీ ఇంకా పంపనే లేదు. కోటి అబద్దాలు ఆడి అయినా ఒక కోడలిని తెమ్మన్నారు పెద్దలు..అందుకే..

“ఆ వెళ్ళాను బామ్మగారు..మూడు సార్లు వెళ్ళాను..చాలా  దేశాలు తిరిగాను లెండి ఆ మాటకొస్తే..అందుకే మా వాళ్ళు అంటూ ఉంటారు నిన్ను ఎవరు చేస్కుంటారో కానీ..” నరకటం మొదలుపెట్టాను..

“ఇంకేం దేశాలు తిరిగావేంటి?” మధ్యలోనే నా వాక్ప్రవాహం ఆపి ప్రశ్నించింది…

“అమెరికా, రష్యా, జర్మనీ, స్వీడన్, మాల్దీవ్స్, సోమాలియా, సూడాన్” ఒకసారి వరల్డ్ మ్యాప్ మెదడులో వేస్కుని శక్తిలో ఇల్లూ లాగా ఏది బడితే అది చెప్పా.

“మంచిది బాబూ..అయితే అక్కడ చేరితే బానే తిరగచ్చు అన్నమాట. సెలవలు ఉంటాయా బాబూ?”

గాడిద చాకిరి చేయించుకుంటూ నెలాఖరికి డబ్బులు పడేస్తారు మా మోహాన పిల్లాడ్ని గిల్లి నోట్లో చాక్లేట్ పెట్టినట్టు. తెలంగాణ అని, వానలు సరిగ్గా పడట్లేదు అని, రాఖి సావంత్ పెళ్లయిపోయిందని,బందులు ఎక్కువైపోయాయని  ఊర్లో బందులు జరుగుంటే మమ్మల్ని మటుకు కూర్చోపెట్టి పని చేయిస్తారు.

మళ్ళీ ‘నాతూ పెళ్ళాం తావాలి’ కాబట్టి “ఓహ్ ఉంటాయి బామ్మగారు. కావలసినన్ని ఉంటాయి” అని చెప్పాను.

“జీతం అది బానే ఉంటుందా?”

“భలే వారే మీరు…సాఫ్ట్ వేర్ అంటే మాటలా.మొన్నే ఒక ఇల్లు, కారు, ఇంట్లోకి సామాను కొన్నాను.” ఇక మీ ఇందు అందులో అడుగుపెట్టటమే ఆలస్యం అన్నట్టు చెప్పాను.

“అదృష్టవంతుడివి బాబు.మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్కోవటమే ఇంక మిగిలింది” అందామె నవ్వుతూ.

“అదే చూస్తున్నారు అండి ఇంట్లో” అని చెప్పాను సిగ్గు లేకుండా సిగ్గు నటిస్తూ..

“మా ఇందుకి కూడా చూస్తున్నాం బాబూ” అంది ఆవిడ. అలా అని నన్ను పైనుండి కిందకి చూడటం మొదలుపెట్టింది..ఛ!ఇదే ట్రైన్ అయ్యుంటే వెంకిలో రవితేజ లాగ వాష్ బసిన్ దెగ్గరికి వెళ్ళి గబ్బుకున్న పెళ్లి చూపులుంటే పనికొస్తుందని నా బ్యాగ్లో పెట్టుకున్న ఎవెర్యూత్ ఫేషియల్ చేస్కుని వచ్చేవాడని. బస్సు అవ్వటంతో పొట్ట లోపలకి పెట్టి, కళ్ళు బయటకి పెట్టి, బుర్ర పక్కకి పెట్టి ఏవేవో ట్రై చేశాను. బామ్మ మొహం చూస్తె నేను నచ్చినట్టే ఉన్నాను. తనేందుకో మురారిలో పెళ్లి పాట ఊహించుకుంటోంది అని నా ప్రగాఢ నమ్మకం.

విజయవాడ వచ్చేసింది. నా ఇందుని చూసే టైం వచ్చేసింది. నాలో ఏదో తెలీని ‘శక్తి’ ఉందని నాకనిపించింది. ఇంకాసేపు ఉంటె మగధీరలో రాంచరణ్ లాగ అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరినీ తాకి ఇందు, ఇందు అని అడిగేవాణ్ణి. నేను బామ్మ వెనకాలే కొరివి దయ్యంలా వెళ్తున్నాను. ఇంతలో “బామ్మా” అని వెనక నుండి ఎవరో మగవాళ్ళ పిలుపు. కొంపదీసి ఇందు కాకుండా వాళ్ళ అన్నో,తమ్ముడో రాలేదు కదా అనుకున్నాను. ఈవిడ వెనక్కి తిరిగింది. నేను జాగ్రత్తగా అదే యాంగిల్ల్లో తిరిగాను. “ఇదే బాబు మా ఇందు” అంది ఆవిడ నా దీపం ఆర్పేస్తూ. అహ నా పెళ్ళంటలో నూతన్ ప్రసాద్లాగా మా అమ్మకు కావాల్సింది అల్లుడు కాదు..కోడలు..అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను.

బాపు-రమణ
“పద్మ” పురస్కారాలు మూడు – పద్మవిభూషణ్ , పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న పురస్కారం తర్వాత వీటిని ఇస్తారు. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, వైద్యం, సామజిక సేవ, పరిశ్రమ, విద్య-ఆయా రంగాల్లో ప్రతిభావంతులకి ఈ పురస్కారాలు ఇస్తారు. కొన్ని సార్లు ఇవి నిజంగా ప్రతిభావంతులు అందరికీ అందుతున్నాయా? అని సందేహం కలుగుతుంది. ఇదేమి ఈ మధ్యే జరిగిన విషయం కాదు. కాని ముమ్మాటికి చర్చనీయమే.

తెలుగు సాహిత్యంలో ముళ్ళపూడి వెంకట రమణ గారికి ఉన్న కీర్తి అసమానమైనది. కుటుంబీకుల మధ్య సంబంధాలు, సామాజిక నైతిక విలువల గొప్పతనాన్ని హృద్యమైన సంభాషణలతో ఆయన రాసిన ప్రతీ కథ ఆయన గొప్పతనానికి ఒక మచ్చుతునక. తెలుగు సాహిత్యం చదివే ప్రతివారు “బుడుగు” అల్లరి చేష్టలు చదివి నవ్వుకునే ఉంటారు. ఇక ఆయన తెలుగు సినిమాలకి రాసిన కథలు ఎంత రమ్యంగా ఉంటాయో చెప్పనవసరంలేదు. అలాగే తెలుగులో హాస్యం గూర్చి ఒక వ్యాసం రాయమంటే రమణగారి ప్రస్తావన లేకుండా ఎవ్వరూ రాయలేరు అంటే అతిశయం ఏమి లేదు కదా!

రమణ అంటే వెంటనే స్పురించే పేరు బాపు. చిత్రలేఖనంలో బాపు కంటూ ఒక  సామ్రాజ్యమే ఉంది.  “అందమైన తెలుగు ఆడపిల్ల అంటే బాపు బొమ్మలా ఉంటుంది” అని చెప్పుకుంటారు. దీని బట్టి ఆయన గీతలకు ఉన్న అందం ఊహించుకోవచ్చు. పడుచు అమ్మాయి ఎన్ని హొయలు పోతుందో ఆయన బొమ్మలలో తెలుస్తుంది. ఇక ఆయన గీసిన రామాయణంలోని ఘట్టాల బొమ్మల గూర్చి ఎంత చెప్పుకున్నా చాలదు ఏమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన చిత్రకారునిగా పని చేసిన ఆయన కొన్ని అన్నమాచార్య కీర్తనలకు దృశ్య రూపం ఇచ్చారుట. తెలుగు పదాలు రాయటంలో కూడా తనదైన అందమైన శైలి ఉంది బాపు గీతలలో.

చిత్రమైనది ఏమిటంటే బాపు-రమణ ద్వయం ఎంత కీర్తి గడించినా వారిని “పద్మ” వరించలేదు. అవి వస్తే తప్ప వీళ్ళు గొప్పవాళ్ళు కానట్టా? అని అడిగే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒక్కటే. ఈ పురస్కారాలు అవి అందుకున్న వారి ప్రతిభకు కొలమానం మాత్రం కావని నేను నమ్ముతాను. భారతరత్న మధురై షణ్ముఖవాడివు సుబ్బులక్ష్మిగారు పాడిన సుప్రభాతంతో కనీసం ౩౦% భారతీయుల దినచర్య మొదలవుతుంది. భారత రత్న లతా మంగేష్కర్ పాడిన “యే మేరె వతన్ కె లోగో” పాట విని నెహ్రు కళ్ళు చెమర్చాయి. హిందీ సినిమా సంగీతం వినే ప్రతీ వారికి ఆవిడ పాటలంటే ఇష్టమే. ఇంత కంటే ఆవిడకి పెద్ద బహుమతి ఉందా? అలాగే తెలుగు సాహిత్య, చిత్రరంగాలలో సృజనాత్మకతకు బాపు-రమణ దిగ్గజాలు అని ఆంధ్రులందరూ నిస్సందేహంగా నమ్ముతారు. ఎటొచ్చీ తతిమ్మా రంగాలలో విరివిగా పురస్కారాలు కుమ్మరిస్తున్న ప్రభుత్వం ౮౦ ఏళ్ళ వయసుకల వీరిని గుర్తించలేనంత కళ్ళు మూసుకుందా అన్నదే నా ప్రశ్న!

(గమనిక: ముళ్ళపూడి గారు ఈ ఏడాదిలోనే గతించారు) .

(బాపు బొమ్మల ప్రదర్శన కావూరి హిల్స్ లో జరుగుతోంది.దాని గూర్చి పత్రికలో చదివి ఆవేశంతో రాసిన ఈ వ్యాసం.)

(పైన బొమ్మలకి కాపి rights ఉండి ఉల్లంఘించినట్లు అయితే దయచేసి క్షమించగలరు.)

కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందానో కలే కల్లలయ్యే వేళ…
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందానో కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతానో!!

http://songbuzz.rediff.com/songs/#!/rangam

ఆటోప్సి!
“నా బిడ్డ కి ఎట్లున్నది సారూ?” ఎవరో ఒకావిడ అడుగుతోంది. నలిగిపోయిన చీర కట్టుకుని, దాంతోనే చెమట తుడుచుకుంటోంది..మొహం మీద ఉన్న ముడతలు, సన్నని దేహం-తన వాలకం చూస్తుంటే వయసు యాభై పైనే ఉండి ఉండొచ్చు అనిపిస్తోంది. చీర, చెప్పులు చూస్తుంటే పేదవారనిపిస్తోంది.

“ఏం సారూ..ఏం అనవు..”

“కొంచం సీరియస్ గానే ఉంది.” ఈ మాట ఎలా చెప్పానో నాకే తెలీదు..

“గంటె ఏంటి సారూ..” ఆమె కళ్ళు నిండుగా ఉన్నాయి..

“కొంచం సేపు అయితే పెద్ద డాక్టర్ వచ్చి అన్ని చెప్తాడు అమ్మా..మీరు అన్నీ ఆయన్నే అడగండి..” అన్నాను..ఆవిడకి అర్ధం అయినట్టుంది..

“నువ్వే ఏదన్న జేసి…”

“పెద్ద డాక్టర్ వస్తాడమ్మా..” అని తనని మధ్యలో ఆపి చెప్పాను..

“చిన్న దేవుడు..పెద్ద దేవుడు ఉంటాడా సారు. నువ్వే దయ సూపీ..ఆడి ఊపిరి ఆగనివ్వకు..నీకు దణ్ణం పెట్టుకుంటా..” ఎడ్చేస్తోంది..

నేనేమో ఇక్కడ హౌస్ సర్జన్సీ కోసం వచ్చాను..నేనేం చెయ్యగలను..మహా అయితే రంగం సిద్దం చెయ్యగలను..మిగితావన్నీ పెద్ద డాక్టర్లే చెయ్యాలి. ఆయనకి కాల్ చేసి పిలుద్దాం అనుకుని ఆవిడకి చూస్తానులే అని చెప్పి లోపలకి వచ్చాను..

ఆయనకి కాల్ చేశాను..సరే వస్తున్నా అని చెప్పి పెట్టేసాడు..ఆయనకి  వాళ్ళ ఇంటి దెగ్గర క్లినిక్ ఉంది..ఇది, అది రెండు ఆయనే చూస్కుంటాడు..అక్కడ వచ్చే లాభం ఇంకా ఎక్కువ..కాబట్టి సహజంగానే అక్కడి డ్యూటీ మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెడతాడు.అసలు మొదట్లో అనుకునేవాడ్ని ఇలా ఎందుకు చెయ్యాలి..ఏం ఇక్కడ సంపాదిస్తోంది సరిపోదా అని? దానికి సమాధానం మాత్రం అనుకోకుండా మా బామ్మ చెప్పింది..నా తమ్ముడు సాఫ్ట్వేర్  ఇంజినీరు. వాడికి నెలకి 60  వేలు వస్తుంది. ఎప్పటికో కాని నాకు అంత రాదు అని మా బామ్మకి చెప్తే …నీకంటే చిన్నోడి చదువే బాగుంది కదరా..నువ్వు ఎక్కువ ఏళ్ళు చదివి తక్కువ సంపాదిస్తావు..వాడు తక్కువ ఏళ్ళు చదివి ఎక్కువ సంపాదిస్తాడు  అని..నేను నవ్వుకున్నాను..

అసలు చాలా మంది అభిప్రాయం కూడా అదే..చదివే చదువుకి, సంపాదించే రొక్కంకి ఎందుకు ఇలా సంబంధం పెడతారో అర్ధం అవ్వదు నాకు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు..బిళ్ళ బంట్రోతు నుండి గవర్నర్ ఉద్యోగందాక ఏ ఉద్యోగానికి ఉండవలసిన,దక్కవలసిన గౌరవం దక్కేది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు లక్షల్లో సంపాదించటం మొదలుపెట్టాక మనుషుల వైఖరి మారటం మొదలుపెట్టింది.. వెధవది..మనిషి చేతుల్లో మారే డబ్బు మనుషులనే మార్చేసింది..

“అరుణ్…could you please get the latest reports and direct Nischala to make arrangements for a surgery?” ఆయన వచ్చేసారు. నేను కూడా నా ఆలోచనల్లోంచి ఈ లోకం లోకి వచ్చేసాను.

“ఎస్ సర్..in a moment.”

సర్జరీ పూర్తి అయ్యింది. అతను చనిపోయాడు.

“మీరొక పని చెయ్యండి. ఈ అబ్బాయి తాలూకు వాళ్ళతో జరిగిన విషయం చెప్పండి..ఆటోప్సికి రెడీ చేసి  పాతోలోజీ ల్యాబ్ వాళ్ళకి కూడా ఇంఫారం చెయ్యండి. సీనియర్లు ఉంటారు కదా..వాళ్ళని అడగండి..ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తారు..” డాక్టర్ గారు నాతొ చెప్పారు.

“సర్..వాళ్ళ అమ్మకి… నేను…” ఈ చావు వార్త ఎలా  చెప్పాలో నాకు అర్ధం కావటం లేదు..చాలా సార్లు విన్నాను ఇలా సీనియర్లు “చావు కబురు మీరే బంధువుల చెవిలో వెయ్యండి” అని చెప్తారని. ఈయన కూడా అలాగే చెప్పారు..

“అరుణ్..పర్సనల్ గా తీస్కోకండి..ఇలాంటివి జరుగుతూ ఉంటాయి..మనం మన సాయసక్తులా ప్రయత్నించాం..అసలు చాలా మేజర్ ఆక్సిడెంట్ అండి ఇది..”

“ఓకే సర్..”

“వాళ్ళకి చెప్పేసి మిగితా పనులు చూడండి.. ప్రాక్టికల్ జరగట్లేదు అని మెడికల్ కాలేజీ నుండి కంప్లైంట్ ఉంది..దాని గూర్చి రిపోర్ట్ ఇస్తాడు శేఖర్..మీరు సాయంత్రం వచ్చినప్పుడు నాకు తెచ్చి ఇవ్వండి”

శేఖర్ మెడికల్ కాలేజీ ప్యూన్. నేను రోజూ సాయంత్రం డాక్టర్ గారి ఇంటికి వెళ్లి పీజీ ఎంట్రన్సు టెస్ట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాను.

“ఓకే సర్..”

బయట ఆవిడతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బహుశా తోడూ వచ్చారు అనుకుంటాను.

“చిన్న సారు వచ్చిండు..” అని ఎవరో చెప్పంగానే నా దెగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు..

“మీ అబ్బాయే కదండీ..” తెల్సే అడిగాను..

“అవును సారు..”

“అతను..అతనికి..” మాట రావట్లేదు..

“పెద్ద ఆపరేషన్ చెయ్యాలి అని పెద్ద డాక్టేరు చెప్పిండు..చేసిన్రా?”

“అవును..పెద్ద ఆపరేషన్ చెయ్యాలి..”

“చేసెయ్యి సారు.” వాళ్ళ అమ్మ అంటోంది.

“లేదు చేసేసాము..” దేవుడా!..ఎందుకు ఇంత కష్టమైన పని నాకు ఇచ్చారు అనుకున్నాను..

“ఎట్లుంది నా బిడ్డకి..”

“అతనికి చాలా దెబ్బలు తగిలాయి కదా..”

“అవు సారు..మీదికెల్లి కప్పు కూలిపోయింది..నెత్తి మీదే పడ్డాయి ఇట్కెలు..”

“అవును..అందుకని అతనికి స్కల్ ఫ్రాక్చర్  అయ్యింది..అందుకని..”

“గంటె ఏంటి?”

“అంటే నా ఉద్దేశం..పుర్రె ఉంటుంది కదా..అది పగిలింది..”

“గప్పుడు ఏం జేస్తరు..” ఎవరో అడిగారు..

“పెద్ద ఆపరేషన్లా గా పుర్రె పలిగిన చోట్ల కుట్లేసి ఉంటరు..” ఇంకెవరో చెప్పారు..

“లేదు అలా చెయ్యరు..అంటే చెయ్యలేరు..”

నన్నే అందరు ఆత్రంగా ఏం  చెప్తానో అని చూస్తున్నారు..

“చూడమ్మా..అతనికి దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి..అందుకే అతన్ని బతికించటం చాలా కష్టమైన పని..అది మావల్ల కాలేదు..” ఎలా చెప్పానో తెలీదు కాని చెప్పేసాను..

“గంటె మా బిడ్డ..”

“చనిపోయాడమ్మ” నా గొంతు మారింది.

“బిడ్డా…” అని ఆమె ఏడుపు ప్రారంభించింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు  కూడా..

“గా మేస్త్రికాడికి పోకురా అంటే వింటివి గాదు బిడ్డా ..గియ్యాల గదే నీ చావు తెచ్చింది కదా..మీ అయ్య కాడికే పోతివి..నేనేం పాపం జేస్తిరా..నన్ను ఇడిసి పోయారు..దీని పెళ్లి నేనెట్ల జేస్తి..నన్ను,దీన్ని కూడా తీస్కపో దేవుడా”

నాకు చాలా బాధగా అనిపించింది. పాపం ఇంకెవ్వరు లేనట్టున్నారు తనకి..ఏం చెప్పి ఒదార్చగలను?..ఆటోప్సి గూర్చి గుర్తుంది..ఆవిడని కదల్చటం ఇష్టం లేక ఊరకున్నాను. ఇంతలో వాళ్ళలో ఒకాయన వచ్చి బాడీని తీసుకువెళ్తాం అని అడిగాడు. ఆ అబ్బాయికి తాత అంట.

“చూడండి..మనిషి చనిపోయాక కొన్ని పద్ధతులు ఉంటాయి..మీరు ఒప్పుకుంటే..”

“ఆడి పేనమే పొయ్యాక ఇంకేం ఉంటాయ్ సారు..”

“అదే.. పోస్ట్ మొర్టెం అంటారు..అది చేసి మీకు అతని శరీరాన్ని అప్పగిస్తాము..”

“గంటె ఏం జేస్తరు..మల్ల బతుకుతడా?” కంగారు పడుతున్నాడు.

“అతను మళ్లీ బ్రతకడు అండి..” వీళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు..”ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు..ఇవన్ని చూసి మీకు అతని డెత్ సర్టిఫికేట్ ఇస్తాము..”

ఏం అర్ధం అయ్యిందో ఏంటో..వెళ్ళిపోయాడు..ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు..

ఏడుపు ఆపి కాసేపు మాట్లాడుకుని ఆటోప్సి చెయ్యమని చెప్పారు. బాడీని తీస్కుని ల్యాబ్ కెళ్ళాను. పాథోలోజి ఆయన ఒకరు వచ్చారు. మొదలుపెట్టారు.

ఆటోప్సి రిజల్ట్స్ వచ్చాయి. అవి చూసి నేను ఖంగుతిన్నాను.

“ఎలా చనిపోయాడు అని వాళ్ళు అంటున్నారు?”పాథోలోజిస్ట్ ప్రశ్న.

“తల మీదకి పైకప్పు కూలింది అంటున్నారండి. అప్పుడు స్కల్ బోన్ విరిగింది. అందుకే చనిపోయాడు అని అనుకున్నాము..ఇప్పుడేమో ఇలా..”

“మీతో ఉన్న సీనియర్ డాక్టర్ ఎవరు?ఆయనకి చెప్పండి ముందు..తర్వాత పోలీసుల్ని పిలిచి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి..ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి..”

“ఓకే సర్..”

రిజల్ట్స్ ప్రకారం అతనికి severe bilateral papilledema ఉంది..కాని వాళ్ళు చెప్పినదాని ప్రకారం అతను సౌండ్ అండ్ హెల్తి. వాళ్ళు తీస్కున్న మెడికల్ ఇన్సురన్స్ కి ఇతను అనర్హుడు. ముందు డాక్టర్కి లంచం ఇచ్చి మేనేజ్ చేసినట్టున్నారు..ఇతను ఆరోగ్యవంతుడు అని రాయించారు. ఇప్పుడు నేను వెళ్లి మా సీనియర్ డాక్టర్కి చెప్పినా మళ్లీ అదే జరుగుతుంది..ఈయన కూడా తన రేట్ చెప్పి మళ్లీ కేసు మార్చి రాస్తాడు. అలా జరగకూడదు అనుకున్నాను. వాళ్లనే మారుద్దాం, చదువుకున్న వాళ్ళు కాదు కదా, చెప్తే వెంటనే వింటారు,సులువు అనుకుని వెళ్ళాను. వాళ్ళ అమ్మ దూరంగా కుర్చుని ఏడుస్తోంది. పాపం ఆమెకి తెలీదు అనుకుంట ఈ రోగం ఉందని. అనుకునట్టే ఈ సారి కూడా మార్చి రాయమని , కావాలంటే అతని కోసం ఇచ్చే డబ్బుల్లో వాటా తీస్కోమని చెప్పారు. వీళ్ళకి  కాస్త హితబోధ చేద్దామనుకుని అలా చెయ్యటం తప్పు అని చెప్పాను. చాలా వాగ్వివాదం జరిగింది.

“నీకేంటి? మా బిడ్డ..మాకు తెలవదు అనుకున్నావు ఆడికి రోగం ఉందని? తెల్సిన ఎందుకు పన్లోకి పంపినం? పైసల కోసం గాదు..?”

“మీరెన్ని అయినా చెప్పండి..అలా చెయ్యటం తప్పు..” కాస్త  కఠినంగా చెప్పాను.

“పైసల్ ఇస్తం అంటే నీకేం చేదు..”

“పోలీసులకి చెప్తాను జాగ్రత్త!” ఇప్పుడు తగ్గుతారు అనుకున్నాను..కాసేపు ఊరుకున్నారు..

ఇంతలో నాతో మాట్లాడిన పెద్ద మనిషి వచ్చాడు..”ఇగో..ఆడి మీద ఇంటికప్పు పడలే..మేమే నెత్తి మీద బండ ఎష్నము ..మాకు పైసల్ కావలె..నీకు కూడా కావాలంటే తీస్కో..గంతే గాని మా కడుపుల్ గొట్టకు..”

నాకు మాట పడిపోయింది…చుట్టు పక్కల చూసాను. అక్కడి నుండి వెళ్ళిపోదాం అనిపించింది. నిజంగానే వెళ్లి పోలీసులకి చెప్పేద్దామా అనుకున్నాను..నన్ను,నా వాళ్ళని ఎమన్నా చేస్తే??

అనవసరంగా తల దూర్చాను అనిపించింది. వాళ్ళు కూడా నన్ను చూసి పోలీసులకి చెప్పేస్తానేమో అని బెదిరినట్టున్నారు..

“సూడు బిడ్డా..ఆడి రోగానికి పెట్టనికి మా కాడ పైసల్ లేవు..ఆడు చస్తే గా మేష్ట్రి పైసల్ ఇస్తడు. గందుకే గాన్ని జంపినం. ఏరే దారి లేకుండే..మేము శాన బీదోల్లం. తిననికి కూడా లేక 2 -3 నెలలు మాడినం. ఆడి చెల్లి పెళ్లికి మస్తు డబ్బులైతై. ఏడికెల్లి తెస్తం?గేట్లైన ఆడు సావనికే పుట్టిండు..గదేదో మాకు సాయం ఐతదని గిట్ల జేష్నం.”

కాసేపు అయ్యాక మళ్లీ ఆయనే చెప్పటం మొదలుపెట్టాడు  “గయినా సచ్చుడు ఆనికి కూడా ఇష్టమే. ఆడు చెప్పిండనే సంపినం. ఇంక జబ్బు ముదిరినాది..పన్లోకి పోలేను..రేపటి సంది ఇంట్లనే పండాలి..నన్ను ఇయ్యలె సంపు తాతా అంటే కడుపుంత ఎడ్షిన. అమ్మకి తెల్వనీకు,అది కూడా నాతొ సస్తది, నువ్వే చెప్పు అని బిడ్డ అంటుంటే నాకే సావు రానందుకు దేవుణ్ణి తిట్టిన. ఆడు సంపు, సంపు అని నన్ను మాటల్తో సంపుతుంటే నేనే బండ లెక్క మారి ఆడి నెత్తి మీద బండ వెట్టి కొట్టిన. ఎత్తి తిప్పిన సేతుల్తోనే ఎత్తి కుదేసిన. ఆడు మామూలుగా జస్తే పైసల్ రావు. గిట్ల పన్ల జస్తేనే ఒస్తయ్. గా పిల్ల మొకం జూసి అయిన మార్చి రాయి బిడ్డా..నీ కట్టం ఉంచుకోము..”

దేవుడా..ఇదో రకం mercy killing ..ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు..వీళ్ళు అసలు నిజమే చెప్తున్నారా? మరీ పిల్లల్ని చంపుతారా లేకపోతే? అంత ప్రేమ లేనివాళ్ళే అయితే ఆ ఆడపిల్ల కోసమే చంపాము అంటున్నారే..అది మాత్రం పిల్లల మీద ప్రేమ కాదూ? మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళే అయితే మరి వీడ్ని ఎట్లా చంపగలిగారు? పిల్లాడికి రోగం ఉందని చంపేసుకుంటారా?  అంత వైద్యం చేయించలేకపోతే వాడి చావు వాణ్ణి చావనీయచ్చు కదా?

నా బుర్రలో ఏదో సుడిగుండం మొదలు ఐపోయింది..కాసేపటికి సీనియర్ వచ్చారు..ఆయన రాకపోతే ఈ ఆలోచనలతో నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి.

“ఏంటి అరుణ్…ఎనీ ప్రాబ్లం?”

పక్కకి తీస్కెళ్ళి మొత్తం చెప్పాను..

“పాపం వాళ్ళ మొహం చూస్తుంటే జాలి వెయ్యట్లేదా అరుణ్ నీకు? మార్చి రాసేద్దాం..వాళ్ళకి ఉపయోగపడే పనే కదా మనం చేస్తున్నది..!ఆ సర్టిఫికేట్ పని,అది కూడా కొంచం తొందరగా చేసేద్దాము”

“పాపం పిల్లాడ్ని అన్యాయంగా చంపేసారు కదా సర్..”

“వాళ్ళ పిల్లాడు, వాళ్ళ ఇష్టం..”

“మీరే అలా అంటే ఎలా సర్..మీరు ఈ mercy killing ని సపోర్ట్ చేస్తున్నారా? మనం చట్టం ఒప్పుకోదు కదా? “

“అరుణ్, దీన్ని voluntary active euthanasia అంటారు..మన దేశం లో లేదు కానీ బెల్జియం, నెదర్ లాండ్స్ లాంటి దేశాల్లో voluntary euthanasia లీగలె. వాళ్ళ ఆర్దిక పరిస్థితికి వాళ్ళు ఇంక చెయ్యగల్గింది ఏం లేదు..ఆ బిడ్డ బ్రతకడు..బ్రతికే దాక వైద్యం చేయించే స్థోమత వాళ్ళకి  లేదు..అతను సాధారణ చావు చస్తే ఆ ఇన్సురన్స్ వాడు డబ్బులు ఇవ్వడు..అందుకు ఇంక తప్పక ఇలా చేశారు”

“అసలు ఎలా నమ్ముతున్నారు సర్ మీరు..వాళ్ళు వేరే స్వార్ధానికి చంపేసి ఉంటే? పోనీ నిజమే అయినా కూడా అసలు ఇది ఇలా వదిలేస్తే రేపటి నుండి ఇలాంటివి ఇంకెన్ని చావులు చూడాలి మనం?”

“ఆవేశపడకు అరుణ్..మన దేశంలో ఎన్ని కేవలం ఒకరి స్వార్ధానికి జరగట్లేదు? వీళ్ళు పేద వాళ్ళు..దీని వాళ్ళ లాభపడుతున్నారు..మనం సాయం చేస్తే ఆదుకున్న వాళ్ళం అవుతాము..వాళ్ళకి లాభము..మనకి పుణ్యము..”

“సర్..” నేను ఆశ్చర్యపోయాను..ఇందులో మళ్లీ సమాజ సేవా?!

“తప్పేముంది చెప్పు..వాళ్ళ  బిడ్డే కదా..పోషించలేకే కదా చంపుకున్నారు. ఇందులో పగలు, ప్రతీకారాలు ఏం లేవు..వాళ్ళ పేదరికం అలా చేయించింది..దీని వాళ్ళ మిగిలే ఖర్చు, వచ్చే డబ్బులు వాళ్ళకి ఊరట..అసలు నన్ను అడిగితే మన దేశంలో కూడా ఇది లీగల్ చెయ్యలయ్యా. డాక్టర్, పోలీసుల ఆద్వర్యంలో ఈ ప్రక్రియ జరిగేందుకు అనుమతి నివ్వాలి..అసలు మొన్న అరుణ కేసులో passive euthanasia కి అనుమతి ఇచ్చింది కదా మన ప్రభుత్వం? వీళ్ళ కేసులో అది కూడా కష్టం కాబట్టి active euthanasia చేస్తున్నాం మనం. కాకపోతే చట్టం మనమే అయ్యి చేస్తున్నాం అంతే..” నవ్వేసాడు ఆయన.

“ఈ అబ్బాయి ఆ అరుణ లాగా ‘vegetable ‘  కాదు సర్..రోజూ పనిలోకి వెళ్ళే అబ్బాయి..పైగా వీళ్ళు నిజమే చెప్తున్నారు అని నమ్మకం లేదు కదా!”

“అరుణ్..కొంచం సేపు మనసుతో ఆలోచించు..ఏం అనిపించకపోతే నేను చెప్పింది చేసెయ్యి..నేను వెళ్ళాలి..” ఆయన వెళ్ళిపోయాడు. మరి నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేకో,ఏమో నాకు అసలు మనసే లేదు అనుకున్నాడు. నాకెందుకులే అని నేను సరిపెట్టుకున్నాను. వెళ్లి సర్టిఫికేట్ వాళ్ళకి కావల్సినట్టే ఇస్తాము అని చెప్పాను. వాళ్ళు ఆనందంతో నా కాళ్ళు పట్టుకున్నారు. ఆ పెద్ద మనిషి దణ్ణం పెట్టి నేను దేవుడిని అన్నాడు. ఇంతలో ఆ పిల్లాడి శవం తీస్కోచ్చారు. ఈ సారి నిజమైన కన్నీరు కారుస్తున్నారు అందరు.  వాడి నొసటి మీద ముద్దు పెట్టుకుని దెగ్గరికి తీస్కున్నాడు వాళ్ళ తాత. ఆ కళ్ళలోంచి ప్రేమ కట్టలు తెంచుకుని ధార లాగా కారుతోంది.

పశ్చాత్తాపం!
“హలో… ” ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఆగాను. ఒక క్షణం చూసి నన్ను  కాదులే అని వెళ్లిపోతుంటే “హల్లో..” అని హోసానా టైపు లో వినపడింది. ఈ  స్టోను చాలా పేమస్ కదా అని తిరిగి చూస్తే అరుణ్ గాడు. వీడ్ని వర్ణించటానికి  తెలుగు భాష చాలదు. ఏదన్న కొత్తది కనిపెట్టాలి. ఎప్పుడూ మచ్చుకకి కూడా  బాధ,కోపం అనేవి వీడిలో  కనిపించవు. ఎప్పుడూ ఓ నవ్వు ఏస్కోని తిరుగుతూ  ఉంటాడు. అదేంటో మంచి అయినా, చెడు అయినా ఏ మాత్రం తేడా లేకుండా ఒకేలా  తీస్కుంటాడు. మంచి జరిగితే “ఇది అనుకున్నదేరా” అనేవాడు. చెడు జరిగితే “ఇంకా  నయం..ఇలా నాశనం అయిపోలేదు” అనేసేవాడు. అసలు వాడు అన్నట్టు నాశనాలు జరిగితే  ఏం చేసేవాడో అని ఎప్పుడో ఒకసారి అనుకున్నా. కానీ దానికి నేనే కారణం  అవుతానని అనుకోలేదు.

“ఏంట్రా సంగుతులు..ఈ మధ్య కనిపించటం మానేసావు?” అని అడిగాడు రొప్పుతూ.

నేను తలదిన్చుకున్నాను. వెళ్ళిపోతా అని తెల్సేట్లు గడియారంవైపు చూస్కున్నా.

“పని ఉందా? తర్వాత మాట్లాడనా?”

“అవును, తర్వాత కలుద్దాం” అనేసి వడివడిగా అడుగులు వేస్కుంటూ అక్కడనుండి వచ్చేసాను.

అసలు జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏమిటో తెల్సా మీకు? మనం  తప్పు చేసినప్పుడు, ఆ తప్పు పర్యావసానం మన సన్నిహితులు అనుభవించినప్పుడు,  అది మన వల్లే జరిగింది అని వాళ్ళకి తెలీక వాళ్ళు మనని అభిమానంతో  చూసినప్పుడు. అసలు మనస్సాక్షి అన్నదే లేని వాళ్ళని పక్కన పెట్టేయండి. అది  ఉన్నవాళ్ళ పరిస్థితి నరకం. వాడికి నిజం చెప్పి సారీ చెప్పమని నా బుద్ధి  చెప్తోంది. ఒక్క సారీతో చేసిన పాపం పోతుందా, పాపం ఎంత యాతన అనుభవించాడో  కదా, నిన్ను అస్సలు క్షమిస్తాడా? అని మళ్లీ తనే కడిగేస్తోంది. ఏం  ఆలోచించకుండా ఉందాం అంటే కుదరట్లేదు. విసుగు వచ్చేస్తోంది. ఇంతలో నా  పక్కనుండి నా లాంటి మనిషే ఒకడు వచ్చాడు.

“ఎవరు నువ్వు? నాలాగే ఎందుకు ఉన్నావు?” అని అడిగాను.

“నేను నీ అంతరాత్మని రా ఫూల్. సినిమాలు చూడవా?”

“ఓహ్ నువ్వా..చెప్పు ఎందుకొచ్చావు?”

“ఎందుకురా అంత బాధపడతావు..తప్పు ఒప్పెస్కో..చెప్పేసెయ్ వాడికి,ఇది చాలా కామన్!”

“సర్లే..నువ్వు అలాగే చెప్తావు..వాడ్ని పేస్ చెయ్యాల్సింది నేను”

“మరి తెల్సే ఆ తప్పు చేసావు కదా..ఎందుకు చేసావు రా?నేను చెప్పినా వినలేదు నువ్వు..”

ఈ అంతరాత్మ కూడా భలే గడుసు అసలు. తప్పు చేసేటప్పుడు నెమ్మదిగా చెప్తుంది. తప్పు జరిగిపోయాక గట్టిగా చెప్తుంది.

“బుద్ధి గడ్డితిని..ముందు జరగాల్సింది చూడు”

“చెప్పకుండా ఉండలేవు.చెప్పకపోతే మటుకు ఇట్లా బాధపడుతూనే ఉంటావు. చెప్పేసి లటుక్కున కాళ్ళు పట్టేస్కో!”

“చస్తానా?”

“మరి ఫోన్ చెయ్యి, కలువు వాణ్ని”  నా అంతరాత్మ వెళ్ళిపోయాడు.

అరుణ్ కి ఫోన్ చేశా.

“రేయ్..నిన్ను కలవాలి..కొంచం అర్జెంటు” అన్నాను.

“ఓకే రా..లైబ్రరీ కి వచ్చేయ్. బయట ఉంటాను.”

వాడు కనిపించంగానే వాడి కాళ్ళ మీద పడిపోయా.

“ఏంట్రా ఇది?”

“రేయ్ అరుణ్..నువ్వు నన్ను క్షమించాలి..”

“దేనికి రా”

“నిన్న నీకు అలా జరిగి ఉండాల్సింది కాదు..”

“ఏంట్రా?”

“నేనే తెల్సి తెల్సి మీకు శక్తి సినిమా టికెట్స్ ఇచ్చాను”

వాడి మొహం సీరియస్ గా  ఐపోయింది. నేను వాణ్ణి అలా చూడటం అదే మొదటిసారి.

“నువ్వు చెప్పేది నిజమా?”

“నిజమే రా”

“ఎందుకు రా అలా చేసావు?”

“ఏం చెయ్యను..ఎవరికి ఇచ్చినా తీస్కోవట్లేదు..డబ్బుల బొక్క  ఎందుకు అని నీకు అమ్మమని శంకర్ చెప్పాడు. నువ్వు లక్కీగా రివ్యూలు చదవవు,  నీకు ఎవరు ఇంకా బాలేదు అని చెప్పలేదు. ఆ సినిమా బానేఉంది అని చెప్పి టికెట్  అమ్మాను. సారీ రా”

వాడు ఇంకా తేరుకోలేదు. కాసేపు ఆగి..

“రేయ్..నా డబ్బులకి  బొక్క పడుతుంది, ఆ సినిమా టికెట్ అమ్మిపెట్టరా అంటే నేనే మా ఆఫీసులో  అమ్మేవాడ్ని కదరా? ఎందుకు రా ఇలా చేసి మన స్నేహాన్ని అవమానపరిచావు ?”  తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ లాగ భలే డైలాగ్ వేసాడు వెధవ.

“అది కాదు రా..నువ్వైతే ఏదన్న పాజిటివ్ గా తీస్కుంటావు కదా అని..”

“మాట్లాడకు!”

నన్ను మూస్కోమని వాడు మూస్కొని వెళ్ళిపోతున్నాడు. శక్తికి ఇంత శక్తి ఉంటుందని అనుకోలేదు.

అరవింద్!
ఏదో అలికిడి అయితే ఆలోచనల్లో నుండి బయటకొచ్చి తల తిప్పి చూసాను. ఇంటి ముందు  “ది లాస్ట్ జర్నీ” వ్యాను వచ్చి ఆగింది. అరవింద్ దిగి వాళ్ళకి ఎంతో ఇచ్చి  పంపించేసాడు. లోపలికి వచ్చి ఇక అంతా ఐపోయింది అన్నట్టు సైగ చేసాడు.తన  కళ్ళల్లో నీళ్ళు! నిన్న అభిని పడుకోబెట్టిన చోట కుర్చుని కాసేపు నేలని  తడిమాడు. ఎంతో చురుగ్గా, అందంగా, గీసినట్టు ఉండే అరవింద్ కళ్ళు ఇప్పుడు  భయంకరంగా ఎర్రగా ఉన్నాయ్. మరి మూడు రోజుల నుండి తిండి లేదు, కునుకు లేదు  ఇద్దరికీ. అసలు అభికి ఇక ఎక్కువ సమయం లేదు అని తెలిసినప్పటి  నుండే అరవింద్  అసలు మనిషి మనిషిలో లేడు. నెమ్మదిగా కళ్ళు మూస్కుని గోడకి వాలాను.

మొదటి నుండి కూడా తనకి ఆడపిల్లే  కావాలి అని అరవింద్ అనేవాడు.  ఎందుకు అంత ఇష్టం అంటే కూతురు అయినా,

అమ్మ అయినా, భార్య అయినా, చెల్లి  అయినా -అసలు ఏ వరస అయినా సరే ప్రతి అమ్మాయిలో ఒక అమ్మ ఉంటుంది అని  చెప్పాడు. తనని కన్న అమ్మ వయసుని, బుద్ధిని, సంస్కారా న్ని పెంచే అమ్మ అయితే  , తను కన్న అమ్మ తన పరువుని,పెంపకాన్ని,బాధ్యతని పెంచే అమ్మ అంట. ఇక  అనుకునట్టే అభి పుట్టినప్పుడు అయితే తన ఆనందానికి అవధుల్లేవు. అమ్మాయే  పుడితే తిరుమల పైకి నడిచి వస్తా అని మొక్కుకున్నాడు. అది పుట్టిన రోజే  వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చాడు.దాన్ని చూస్తూనే నాతో అన్నాడు..ఒక  ఆడపిల్ల కి సంబంధించిన ప్రతి పండగ జరిపిద్దాం.అది కూడా చాలా గొప్పగా  చేద్దామని. అన్నట్టే అన్నీ క్రమంతప్పకుండా చేస్తూ వచ్చాము. చిన్న పిల్లలు  స్పర్శద్వారా గుర్తుపెట్టుకుంటారు  అని ఏదో శాస్త్రం. అందుకే తనే దానికి  స్నానం చేయించేవాడు. దాని తిండి,నిద్ర,బట్టల విషయాల్లో కూడా తనే ఎక్కువ  శ్రద్ధ చూపించేవాడు. కొన్నిసార్లు నా మాట కూడా వినేవాడు కాదు. ఒక విధంగా  చెప్పాలంటే తనే దానికి తల్లి అయిపోయాడు.

ఇప్పుడు అరవింద్ కూర్చున్న చోటే దాన్ని మొదట ఉయ్యాలలో వేసింది. అక్కడే  దాని అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు, అక్షరాభ్యాసం. ఆ చోటు అంటే  తండ్రికూతుళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు రోజూ అక్కడే ఆడుకునే వాళ్ళు. దాని  వయసులో మా నాన్న నన్ను ఎలా చూస్కున్నారో గుర్తులేదు కానీ, మా నాన్న అంటే  జడిసే నాకు ఇలా మటుకు చూస్కుని ఉండరు అని అనిపించేది. ఇక అది కష్టపడి  “నానా” అన్న రోజు అరవింద్ మోహంలో ఎంత ఆనందం కనిపించిందో మాటల్లో  చెప్పలేను.గమ్మత్తుగా అది నాన్న ఏడి అన్నా,అమ్మ ఏడి అన్నా అరవింద్ నే  చూపించేది. మమ్మీ అంటే నన్ను చూపించేది. అమ్మ, మమ్మీ ఒకటేనే అని ఎంత  చెప్పిన అర్ధం చేస్కునేది కాదు.అరవింద్ ఏమో ఉడుక్కుంటున్న నన్ను చూసి ఇంకా  రెచ్చగొట్టేవాడు.

ఏదో సినిమా లాగా, కల్పితకధల్లో లాగా ఉండేవాళ్ళు ఇద్దరు. హాఠాత్తుగా ఒక రోజు ఏదో నోరు తిరగని  రోగం దానికి ఉందని చెప్పి డాక్టర్ ఐసీయూ లో పెట్టారు. మొదట్లో నాకేమి అర్ధం  కాలేదు. ఆరవింద్ ని అడిగితే ఏం కాలేదు,ఏదో చిన్నదే, పట్నంలో ఇవి మామూలే   అని చెప్పి దాటేసాడు. కానీ అభి వెళ్ళిపోయే ముందు రోజు మాత్రం మనకే ఎందుకిలా  జరిగింది అంటూ ఏడ్చాడు. ఇద్దరం ఉన్నప్పుడే దాన్ని వెంటిలేటరు తీసేసి  డాక్టర్ తీస్కెళ్ళిపోమన్నాడు. తీస్కెళ్ళిపొమ్మంటే అది అప్పటికే  వెళ్ళిపోయింది అన్న సంగతి నా మట్టి బుర్రకి అర్ధం కాలేదు. ఏదో అద్భుతం  జరుగుతుంది ఏమో అని అతి చిన్న ఆశతో ఉన్న నాకు దేవుడు ఉన్నాడనిపించింది.  కాని ఆరవింద్ ఏడుపు చూసాక ఘోరం జరిగిపోయింది అని బోధపడింది. మగవాళ్ళు  ఆడవాళ్లలాగా ఏడవరు అనుకునేదాన్ని. ఆరవింద్ ని అప్పుడు చూస్తే కంట తడి  పెట్టని వారుండరు. నేనే తన భుజం మీద చెయ్యివేసి పెద్ద ఆరిందాలాగా దైర్యం చెప్పజూసాను.నా వల్ల  కాలేదు!

ఇంటికి వచ్చాక దానికి ఇష్టమైన చోట పడుకోబెట్టాము.నిర్జీవంగా పడివున్న దాని శరీరాన్ని నేను అసలు కనీసం ముట్టుకోలేకపోయాను.  అరవింద్ మాత్రం కళ్ళని చేత్తో మూసుకుని ఏడుస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా జనం  వచ్చారు. అన్నీ శాస్త్రోక్తంగా జరిగాయి.దెగ్గరి చుట్టాలు తప్ప అందరూ  వెళ్ళిపోయారు. కాస్త తేరుకున్న నేను మర్యాద చెయ్యబోతే వారించి పక్కన  కూర్చోమన్నారు. అప్పటినుండి ఇలా ఆలోచనల్లో-కాదు కాదు , జ్ఞాపకాల్లో  తేలుతున్నాను.

మళ్లీ అలికిడి అయితే కళ్ళు తెరిచి చూసాను.

“అరవింద్ గారి ఇల్లు ఇదేనామ్మ?”

“అవును..ఆయనే” అని చెప్పి పడుకున్న అరవింద్ ని చూపించాను.

“అరవింద్..ఒక్కసారి లేవండి” అని తనని తట్టాను.

ఒళ్ళంతా చల్లగా ఉంది. భయంతో ఒక్క నిమిషం నా ఊపిరి ఆగిపోయింది.

కాని,వాళ్ళ అమ్మ ఇక లేదని అరవింద్ ఊపిరి శాశ్వతంగా ఆగిపోయింది.

గోదావరి ఎక్స్ ప్రెస్
“దయచేసి వినండి..ట్రైన్ నంబరు 7008 హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన గోదావరి ఎక్ష్ప్రెస్స్  ఒకటవ నంబరు ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకు సిద్దంగా ఉన్నది“

అనౌన్సుమెంట్ విని ఈ లోకానికి వచ్చాను. హైదరాబాదు, విశాఖపట్నం రెండూ నాకు ప్రియమైన ఊర్లే. విశాఖపట్నం నాకు జన్మనిచ్చి, విద్యనిచ్చిన పుట్టినిల్లు  అయితే హైదరాబాదు జీతమిచ్చి అన్నం పెడుతున్న మెట్టినిల్లు. అటువంటిది ట్రైను ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు విశాఖపట్నం జేరుతానా అని అసహనంగా ఎదురు చూడసాగాను. సొంత ఊరు కన్న తల్లి వంటిది అని ఎవరో మహానుభావులు అన్నారు. నిజమే అనిపించింది. తన ఒడ్డున కూర్చోబెట్టుకుని ఆ మహా సముద్రం నాతో ముచ్చట్లాడిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. తన వైపు తదేకంగా చూస్తూ  ఉన్న నా కళ్ళను బట్టి నా మనసు అర్ధం చేసుకొని బంగాళాఖాతం తన హోరుతో ఊకొట్టేది. ఎగసిపడుతున్న ప్రతి అల నాకు ఒక స్నేహితుడిలా కనపడేది. “ఒక్కడివే ఆ దిక్కుమాలిన బీచ్ లో అంత సేపు ఎలా కూర్చుంటావురా?” అని నాన్న అడిగితే నవ్వుకునేవాడిని. ఊరు చేరంగానే ఒకసారి సముద్రతీరానికి వెళ్లి, నా ఈ కసి అంతా తన దెగ్గర వెళ్ళగక్కుదామనుకున్నాను.

ట్రైను నెమ్మదిగా కదిలింది. నా జ్ఞాపకాలు కూడా. కీర్తి నాకు మూడేళ్ళుగా తెల్సు. మా ఇద్దరికీ పెళ్ళయ్యి నాలుగు ఏళ్ళు అయ్యింది. అలా ఎందుకు అన్నాను అంటే తనని తనుగా నేను అర్ధం చేస్కోగలిగింది మూడేళ్ళనుంచే. అసలు ఒక మనిషిని అర్ధం చేస్కోవటం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే, ఏ సంఘటనలో అయినా ఆ మనిషి ఎలా స్పందిస్తాడో ఊహించగలిగితే చాలు,అర్ధం చేస్కున్నట్టే అని నేను నమ్ముతాను. అలా నేను కీర్తిని మా పెళ్లి అయిన ఏడాదికి కానీ అర్ధం చేస్కోలేకపోయాను. బహుశా మొదట్లో పరాయింటికి వచ్చిన ఆడపిల్ల కదా! ఆ మొహమాటము, బిడియము వల్లేమో, సరిగ్గా తెలుసుకోలేకపోయాను.

ట్రైను వరంగల్  దాటింది. కీర్తి ఇక్కడే REC లో ఇంజనీరింగ్ చదివింది. నాతో సరితూగే పిల్ల కావాలని అమ్మ ఏరికోరి కీర్తి సంబంధం కుదిరించింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావటంతో తన పేరు, గోత్రం, నక్షత్రం, ఇష్టమైన సినిమాలు తదితర విషయాలు తప్ప మరేమీ పనికొచ్చే విషయాలు తెలుసుకోలేకపోయాను. చురుకైన పెద్ద కళ్ళు, పొడవాటి ఒత్తైన జడ, తెల్లటి అందమైన పాదాలు, ప్రసన్నమైన ముఖం – ఇవి కీర్తిని చూడంగానే నన్ను ఆకట్టుకున్నవి. ఈడు-జోడు బాగుంటుంది అని ఇంట్లో అనుకుంటూ ఉండంగానే నేను సరే అనటంతో అందరూ  సంబరపడిపోయారు. పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి.

విజయవాడ వచ్చినట్టుంది. టైము పదకొండు దాటింది. భోజనం చెయ్యలేదు అని గుర్తురాగానే ఆకలి వేసింది. ఏమైనా కొనుక్కుందామని కిందకి దిగాను. ఒక ఇడ్లీ ప్యాకెట్ కొనుక్కుని తిరిగి నా సీట్లో కూర్చుకున్నాను. నేను కిందటిసారి విజయవాడ నా పెళ్ళప్పుడు వచ్చాను. లక్షలు పోసి ఆర్భాటంగా చేస్కునే పెళ్లి అనే పండగ అంటే  నాకు మక్కువ లేదు. ఎందుకంటే పెళ్ళికి ముహూర్త బలం మాత్రం చాలు అని నేను నమ్ముతాను. కానీ స్థాన బలం కూడా కావాలి అని కీర్తి వాళ్ళ నమ్మకం అనుకుంటాను. అక్కడ ఏదో ఫైవ్ స్టార్ హోటల్  బుక్ చేసారు. ఒక్కడ్నే కొడుకుని కావటంతో మా అమ్మ,నాన్న కూడా నా పెళ్లి వైభవంగా జరగాలని నన్ను ఒప్పించేసారు. అలా మా పెళ్లి జరిగిపోయింది.

రైలు బయలుదేరింది.కూర్చుని కూర్చుని నడుము నొప్పిగా ఉండటంతో నెమ్మదిగా వెనక్కి వాలాను. కీర్తి గూర్చి తలుచుకుంటుంటే అసలు కునుకన్నదే రావట్లేదు. తను చెడ్డది కాదు. అలాగని నాకు మంచిది కాదు. మేము పరస్పరం తగము అంతే. మా ఇద్దరి ఆలోచనల్లో అంత తేడా ఉంది. చల్లటి సాయంత్రం వేళ ఏ పార్క్లోనో నడవాలని నేను కోరుకుంటాను. అదే సాయంత్రం తను మా కారులో షికారుకెళ్ళాలంటుంది. బయట వాన పడుతుంటే బండి దగ్గర వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినాలి అని నా మనసు కోరుకుంటే తను డామినోస్ పిజ్జా తినదామంటుంది. నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఎవరైనా పెద్దవారికి సీట్ ఇచ్చినా అది వారికి సాయపడినట్టే అనుకుంటాను. తను బస్సు ఎక్కదు..ఎక్కినా ఆ సీట్ న్యాయంగా తనదే కాబట్టి లేచి మరొకరికి ఇవ్వదు. ప్రేమతో కొనిచ్చేది ఒక్క  గ్రీటింగ్ కార్డు అయినా చాలు అని నా అభిప్రాయం.  గిఫ్ట్ అంటే వేలు పోసి రిస్ట్ వాచో, ఐపాడో కొనివ్వడం తన సంప్రదాయం. ఇలా మా ఇద్దరి మద్య వ్యత్యాసాలు రోజులు గడిచే కొద్దీ అడ్డు గోడల్లా కనిపించసాగాయి.

రైలు మళ్లీ ఆగింది. తాడేపల్లిగూడెం అనుకుంటాను. ఎవరో దంపతులు ఇద్దరు మా కంపార్ట్మెంట్ కి వచ్చి కూర్చున్నారు. అందులో అమ్మాయిని చూస్తే  ఆ రోజు పొద్దున్న జరిగిన గొడవ జ్ఞప్తికి వచ్చింది. పదిహేనేళ్ళ  బీమా నా పెళ్లి  కాకముందు  మా ఇంట్లో  పనిమనిషి. చదువంటే  తనకి ఎంతో  ఇష్టం . తనని చదువు మానిపించి బలవంతంగా పెళ్లి చేస్తుంటే, వద్దని వారించి చదువుకి అయ్యే ఖర్చు భరిస్తాను అని మాట ఇచ్చాను. ఆ రోజు ఉదయం బీమా డిగ్రీ తీస్కుని కృతజ్ఞతలు చెప్దామని ఇంటికి వస్తే, కీర్తి తనని చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయికి చదువు మేము పెట్టిన భిక్షే అన్నట్టు మాట్లాడింది. దాంతో ఆ అమ్మాయి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. కోపమొచ్చి కీర్తిని నేను మందలించాను. మాటకి మాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. విపరీతమైన కోపంతో అక్కడినుండి ఆఫీసుకి వచ్చేసాను. అక్కడ కూడా ఉండబుద్దికాక ఇండెఫినెట్ లీవ్ పెట్టి విశాఖపట్నం బయలుదేరాను.

రాజమండ్రిలో ట్రైన్ ఆగింది.  నా ఆలోచనలు కూడా ఆగాయి. ఇక తనతో కలిసి ఉండలేనని తనతో చెప్పేద్దాం అని నిర్ణయించుకున్నాను. మొదట  తను బాధపడుతుంది ఏమో  అని అనిపించింది. కానీ నా ఆదర్శాలకి విలువివ్వని మనిషితో జీవితాంతం కల్సి ఉండటం కష్టం అని తోచింది. కాబట్టి తను  బాధపడినా సరే విడిపోవాలని అనుకున్నాను. తను మటుకు నన్ను ఎప్పుడు బాధపెట్టలేదా ఏంటి అని ఉక్రోషంతో  నా మనసు ఉడికింది.

రైలు సామర్లకోట జేరింది. కాకినాడ వెళ్లేందుకు ఇక్కడ మారవలెను అని రాసుంది. చేరవలసిన గమ్యం ఒక్కటి కానప్పుడు కల్సి ప్రయాణం చెయ్యలేము అని మరొకసారి నాకు నేను చెప్పుకున్నాను.  ఒక అమ్మాయి మనకి తగినదో,కాదో తెలుసుకోవాలి అంటే కచ్చితంగా తనతో ఉంటేనే కాని తెల్సుకోలేము, అందుకనే ప్రేమ వివాహం సరైనది అని నా స్నేహితుడు అనేవాడు. అమ్మాయిలంటే వస్తువులు కాదు, ఒకసారి ట్రై చేసి నాకు నచ్చలేదు, నప్పలేదు అని పక్కన పెట్టేయ్యటానికి అని నేను అనేవాడిని. ఇప్పుడు వాడన్నదే సబబుగా అనిపిస్తోంది. కీర్తి ఇలా ఆలోచిస్తుంది అని తెలిసి ఉంటే నేను ముందుగానే తప్పుకునే వాడ్ని.

అన్నవరం జేరాను. అది కీర్తి వాళ్ళ స్వస్థలం. వాళ్ళ నాన్నకి ఏవో వ్యాపారాలు ఉండి విజయవాడ లో స్థిరపడ్డారు. అసలు డాబు, దర్పం చేసేపనుల్లో చూపించాలి అన్న వాళ్ళ ఆలోచనకి నేను మొదట నవ్వుకున్నాను. కూతుర్ని ఇలాగేనా పెంచేది అని నా మనసులోనే వాళ్ళని నిందించాను. ఒక్కసారి అయినా కారు అద్దాల వెనక ఉన్న ప్రపంచం చూపించారు కాదు అని తిట్టుకున్నాను. కీర్తిని తలుచుకుంటే నాకు అప్పుడు జాలి వేసింది. బహుశా వాళ్ళు అలా పెంచి ఉండకపోతే తను అలా ఉండేది కాదేమో అనిపించింది. ఏదో సినిమాలో చెప్పినట్టు చెట్టుని బట్టే కాయ ఉంటుంది. నాకు అందిన కాయ రుచించట్లేదు. ఏమిటో నా ప్రాప్తం అని నిట్టూర్చాను. ఇందాక ఎక్కిన దంపతులు ఏవో తర్జనభర్జనలు పడుతున్నారు. వాళ్ళు తెచ్చుకున్న మూట కనిపించట్లేదుట. బండి ఎక్కినవెంటనే ఆ మూటను పైన పెట్టారని నేను గమనించాను. ఆ విషయం వాళ్ళకి చెప్పాను. అది చూస్కుని ఇద్దరూ కుదుటపడ్డారు. పాపం ఆ అమ్మాయికి ఏదో హృద్రోగం ఉందిట. అందుకని జీవితాంతం ఆ అమ్మాయి ప్రతి మూడు నెలలకి ఏదో ఖరీదైన ఆపరేషన్ చేయించుకోవాలిట. ఆ ఆపరేషన్ కోసమే వైజాగ్ వెళ్తున్నారుట. మరి కష్టంగా లేదా అని అడిగాను. అది ఆ బంధంతో పాటు వచ్చిన తన బాధ్యత అని సంతోషంగా చెప్పాడు అతను. ఆశ్చర్యపోయాను. “అవునండి, కాస్త కష్టంగానే ఉంది” అని అంటాడేమో అనుకున్నాను. ఆమె హృదయానికి శారీరకంగా ఉన్న  రోగానికిగాను అతను జీవితాంతం మందులిప్పిస్తున్నాడు. నా భార్య కి మానసికంగా ఉన్న రోగానికిగాను నేను తనని జీవితాంతం నా నుంచి దూరం చేసేస్కుంటున్నాను. ఇది సబబు కాదు అని తోచింది. తనకి మందు ఇవ్వకుండా శిక్ష వేస్తున్నాను అనిపించింది.

రైలు విశాఖపట్నం జేరింది. చెయ్యవలసిన పనిని మరొక్కసారి నాకు నేను గుర్తుచేస్కున్నాను. ఇల్లు జేరాక హైదరాబాద్ ఫోన్ చేశాను. కీర్తి మాట్లాడింది.

“అయినా ఎంటండి..రాత్రంతా ఇంటికి రాలేదు. సెల్ కూడా ఆఫ్ చేసారు. ఎవరిని అడిగినా తెలీదు అన్నారు. ఎంత కంగారేసిందో”

“సారీ..అర్జెంటుగా బయలుదేరాను. నీకు చెప్పి ఉండాల్సింది.”

“గొంతు అలా ఉందేమిటి? బడలికా? లేక రాత్రి AC పడలేదా?”

“అదేం లేదు..నేను స్లీపెర్ లో వచ్చాను..కొద్దిగా అలసిపోయాను అంతే”

“స్లీపెర్ లో వెళ్ళారా? మనకేం ఖర్మ?”

చిన్నగా నవ్వుకున్నాను.

నివాళి
పసి నవ్వుల్ని చిదిమేసిన పాపిష్టి డబ్బుకోసమా నా కష్టము?

అని ప్రతి ఉద్యోగికి ఒక్క క్షణం కలిగే ఆలోచన,

ఇంక ఏ లేత మొగ్గా ఇలా వాడిపోకుండా చూడు స్వామీ

అని ప్రతి ప్రేక్షకుడు చేస్తున్న ప్రార్ధన,

కంటికి రెప్పలా చూస్కుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయిందని

చూసే ప్రతి కన్ను చేమర్చేలా ఒక తల్లి రోదన,

నా బిడ్డకే ఇలా ఐతే నేనోర్వగలనా?

అని ప్రతి తల్లీ పడే ఆవేదన,

కిరాతకాన్ని అంతం చెయ్యండి, కిరాతకులనే కాదు,

అని రాష్ట్రం అంతటా ఒక్కటై మొగుతున్న జనాల ఆక్రోదన,

వీటన్నిటి సాక్షిగా,

వేడి కనీరు తప్ప

ఇంకేమి సమర్పించుకోలేని

ఈ కలచివేయబడిన హృదయం నీకర్పిస్తోంది అశ్రునివాళి.

సరిగమలు
Endaro mahanubhavulu

సలలితముగా ఒక ధ్వని

రివటలు గా చీలి,తిరిగి ఏకమై

గమకములే మలుపులు గా

మది కడలిని చేరు జీవనది యే సంగీతము.

పదములకు శృతిలయలు

దధిక్షీరమ్ములవలె అద్ది

నిస్సారముకైన సారమును ఇవ్వగల

సమ్మొహానాస్త్రము ఈ సంగీతము.

సరస్వతీ పుత్రుల కలమునందు

నిక్షిప్తమై ఉన్న పదసంపదకు

దక్షుని జామాత ఓంకారము తో మొదలు

పలికించు అలంకారము ఈ సంగీతము.

మణిమయభూషితాలు సైతం సరితూగలేని

గగనతుల్యము ఈ అమృతము

రిష్టమును దూరము చేయు మంగళము

సకలజీవకోటికీ వీనులవిందు ఈ సంగీతము.

అంతర్మధనం
దాని ఊసే తెలియని మనసులో పుట్టింది ఇది

పంకం లోంచి వచ్చే పద్మం లా..

మరెన్నో భావనల్లో నుండి వెలుగు చూసింది

మబ్బులు చీల్చుకుని వచ్చే సూర్యకిరణం లా..

చెక్కిలి లోగిలిలో వెచ్ఛటి తడి కల్లాపి జల్లి..

పెదవులపై వెలిసింది ముత్యాల ముగ్గు లా..

వేరైన రెండు మనసులను కలిపి ఒక హారం అల్లి

ఏ కల్మషం లేక నవ్వింది పల్లె పడుచు సిగ్గు లా..

తోడు లేని నడక అలుపు అంటూ,

ఒంటరిగా మోయలేని బతుకు  బరువు అంటూ ,

ఆరాటపడుతున్న మనసుని,మొహమాటపడుతున్న బుద్దిని

నేర్పుగా నడిపింది ఒక సారధి లా..

కలహాలు వచ్చినా, విరాహాలు పెరిగినా,

నేనున్నా అంటూ కలిపింది ఒక వారధి లా..

మాటలకి అందనిది,

ఏ ఒకరికి చెందనిది,

అంతం అంటూ లేనిది,

వృధ్యాప్యం రానిది.

ప్రేమ కాదిది..

వాంఛ కాదిది..

ఒక పేరంటూ లేదు దీన్ని పిలవటానికీ,

ఎన్ని యుగాలు ఐనా సరిపోవు దీన్ని మరువటానికి.