గెలిచానా?ఓడానా?

ఇన్నాళ్ళు  తెలియలేదు నా మనసుకి ఈ లోటు,

మీరు ఉండగ నా చెంత ప్రతి పూట ప్రతి చోటు.

నాలుగెళ్ళ ఈ స్నేహం రాసుంది మునుపెప్పుడొ,

దీని మొదలు గుర్తులేదు తొలి ఎక్కడో,మలి ఎక్కడో.

గెలుపుల్లో చప్పట్లు,

కష్టాలతో ఇక్కట్లు,

మాటలు పెరిగి కలహాలు,

కలిసి పొమ్మనే సలహాలు.

ప్రతి పూట సంబరం,

సంతోషం అంటెను అంబరం,

మరువలేని  ఈ  సావాసాలు,

ఈ జన్మకు ఇది చాలు.

వీడుకోలు దగ్గరయ్యింది వేడి చెమ్మ సాక్షిగా,

కాలన్ని ఆపాలి అని ఉన్నా  నేను బ్రహ్మ కాదుగా!

గెలిచానా మిమ్మల్ని మరల ఓడటానికి?

యుధిష్టిరుడై మూగవోయాను,బదులు లేదు ఈ ప్రశ్నకి!

9 Comments

  1. poem chala bagundi anu. Frenstho entha contact lo vunna vallu deggara vunnapudu kalige anandame veru. Jobs vachaka kooda close frenstho entha contact lo vunna ippatilaga college lifeni maripinchalevu kada… Anduke danni compensate chesukotaniki atleast yearly once anna naa school n inter best frensni kalisi vasthunta :). Kani 6th classlo miss ayina sree lakshmi matram inka doraka ledu 😦

    స్పందించండి

  2. వీడుకోలు దగ్గరయ్యింది వేడి చెమ్మ సాక్షిగా,

    కాలన్ని ఆపాలి అని ఉన్నా నేను బ్రహ్మ కాదుగా!

    గెలిచానా మిమ్మల్ని మరల ఓడటానికి?

    యుధిష్టిరుడై మూగవోయాను,బదులు లేదు ఈ ప్రశ్నకి!

    ఈ లైన్స్ నాకు బాగా నచ్చాయి.

    స్పందించండి

వ్యాఖ్యానించండి