నివాళి

పసి నవ్వుల్ని చిదిమేసిన పాపిష్టి డబ్బుకోసమా నా కష్టము?
అని ప్రతి ఉద్యోగికి ఒక్క క్షణం కలిగే ఆలోచన,
ఇంక ఏ లేత మొగ్గా ఇలా వాడిపోకుండా చూడు స్వామీ
అని ప్రతి ప్రేక్షకుడు చేస్తున్న ప్రార్ధన,
కంటికి రెప్పలా చూస్కుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయిందని
చూసే ప్రతి కన్ను చేమర్చేలా ఒక తల్లి రోదన,
నా బిడ్డకే ఇలా ఐతే నేనోర్వగలనా?
అని ప్రతి తల్లీ పడే ఆవేదన,
కిరాతకాన్ని అంతం చెయ్యండి, కిరాతకులనే కాదు,
అని రాష్ట్రం అంతటా ఒక్కటై మొగుతున్న జనాల ఆక్రోదన,
వీటన్నిటి సాక్షిగా,
వేడి కనీరు తప్ప
ఇంకేమి సమర్పించుకోలేని
ఈ కలచివేయబడిన హృదయం నీకర్పిస్తోంది అశ్రునివాళి.
Vaishnavi

వ్యాఖ్యానించండి